జనసేనను వదిలే ప్రసక్తే లేదంటున్న బాలినేని

మాజీ మంత్రి, జ‌న‌సేన నాయ‌కుడు బాలినేని శ్రీనివాస‌రెడ్డి తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌సేన పార్టీలో తాను ఎలాంటి ప‌ద‌వులూ ఆశించ‌డం లేద‌న్నారు. తాను ఎన్నిక‌ల త‌ర్వాత‌.. పార్టీలో చేరాన‌ని.. ఇంత స్వ‌ల్ప స‌మ‌యానికే ప‌ద‌వులు ఆశించే ప‌రిస్థితి లేద‌న్నారు. తాను పార్టీలో కొన‌సాగాల‌ని అనుకుంటున్నట్టు చెప్పారు. స‌భ్య‌త్వం వ‌ర‌కు తాను సంతృప్తి చెందుతాన‌ని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌పైనా బాలినేని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మావిగ‌న్ అనే ప్ర‌తిపాద‌న‌ను కేవ‌లం ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించే డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌గా అభివ‌ర్ణించారు. అధికారంలో ఉన్నప్పుడు.. భ‌జ‌న చేసేవారిని.. పొగిడేవారిని మాత్ర‌మే జ‌గ‌న్ త‌న చుట్టూ తిప్పుకొన్నార‌ని.. మంచి చెప్పిన త‌న‌ను ప‌ట్టించుకోలేద‌న్నారు. ఎన్నిక‌ల‌కుముందు కూడా.. తాను అనేక సూచ‌న‌లు చేశాన‌ని.. ఒక్క‌టి కూడా ప‌ట్టించుకోక పోవ‌డం వ‌ల్లే తాను ఓడిపోయి.. మ‌మ్మ‌ల్ని కూడా ఓడించార‌ని వ్యాఖ్యానించారు.

విశాఖ‌తోపాటు మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న చేసిన స‌మ‌యంలో.. అలా చేయొద్ద‌ని తాను ప‌దే ప‌దే చెప్పిన‌ట్టు పేర్కొన్నారు. గుంటూరులోని నాగార్జున యూనివ‌ర్సిటీ స‌మీపంలో రాజ‌ధానిని ఏర్పాటు చేయాల‌ని తాను స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి ద్వారా సూచించాన‌న్నారు. కానీ.. త‌న మాట‌ను పెడ‌చెవిన పెట్టార‌ని అన్నారు. అప్పుడే నాగార్జున యూనివ‌ర్సిటీ ద‌గ్గ‌ర రాజ‌ధానిని ప్ర‌క‌టించి ఉంటే.. అటు కృష్నా, ఇటు గుంటూరు ప్ర‌జ‌లు కూడా యాక్స‌ప్ట్ చేసేవార‌ని.. కానీ, జ‌గ‌న్ భ‌జ‌న ప‌రుల మాట‌లే విన్నార‌ని తెలిపారు.

మా అబ్బాయిపై..

త‌న కుమారుడిపై.. అనేక విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని బాలినేని చెప్పారు. ఎన్నిక‌ల‌కు ముందు.. త‌ర్వాత కూడా.. త‌న కుమారుడిని ల‌క్ష్యంగా చేసుకుని అనేక ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని పేర్కొన్నారు. అయితే.. వాటిపై ఇప్ప‌టికైనా విచార‌ణ‌కు ఆదేశించాల‌ని సీఎం చంద్ర‌బాబుకు స్వ‌యంగా తానే లేఖ‌రాశాన‌న్నారు. విచార‌ణ‌కు ఇప్ప‌టికైనా.. తాము సిద్ధ‌మేనన్నారు.

నాకు మొహమాటం లేదు..

త‌న‌కు మొహమాటం లేద‌ని బాలినేని చెప్పారు. రాజ‌కీయాల్లో అధినేత బాగుంటేనే తామంతా బాగుంటామన్న సిద్ధాంతాన్ని తాము న‌మ్ముతాన‌ని పేర్కొన్నారు. గ‌తంలో వైసీపీలో ఉన్న‌ప్పుడు.. కూడా ఇదే సూత్రాన్ని పాటించాన‌న్నారు. కానీ, నాడు మంచి చెప్పినా.. వినిపించుకోలేద‌న్నారు. ఇప్పుడు జ‌న‌సేన‌లోనూ.. త‌ను అదే ఫార్ములాను పాటిస్తున్న‌ట్టు తెలిపారు. ఉన్న‌ది ఉన్న‌ట్టు చెబుతున్నాన‌న్నారు. అధినేత మెప్పుకోసం ఏ నాడూ తాను పాకులాడ‌లేద‌న్నారు. ప‌ద‌వుల కోసం కూడా.. ఎదురు చూడ‌లేద‌న్నారు.