Political News

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. వేట నిషేధ స‌మ‌యంలో మ‌త్స్య‌కార కుటుంబాల‌కు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఏటా ప్ర‌భుత్వం ఇస్తున్న రూ.20 వేల న‌గ‌దును వారి వారి ఖాతాల్లో జ‌మ చేశారు.

అనంత‌రం.. స‌భ‌లో మాట్లాడారు. అక్క‌డితో చంద్ర‌బాబు నెల్లూరు షెడ్యూల్ ముగిసింది. అనంత‌రం ఆయ‌న కుప్పం వెళ్లాలి. కానీ, మ‌త్స్య‌కారుల ఆహ్వానం మేర‌కు.. ఆయ‌న కుప్పం షెడ్యూల్‌ను సైతం క్యాన్సిల్ చేసుకుని.. స్థానికంగా ఉన్న మార్కెట్‌ను ప‌రిశీలించేందుకు వెళ్లారు.

మార్కెట్‌లో క‌లియ‌దిరిగి ప‌రిశీలించిన చంద్ర‌బాబు.. మ‌హిళా వ్యాపారుల‌ను ప‌ల‌క‌రించారు. అదేస‌మ‌యంలో పుష్టిగా ఉన్న చేప‌లు మార్కెట్‌కు వ‌చ్చాయి. దీంతో వాటిపై మ‌న‌సు ప‌డ్డ చంద్ర‌బాబు.. ఓ మ‌హిళా వ్యాపారి వ‌ద్ద‌కు వెళ్లి కేజీ చేప‌లు కొనుగోలు చేశారు.

దానికి సంబంధించిన న‌గ‌దు కూడా ఇచ్చారు. అనంత‌రం.. త‌న‌తోపాటే మార్కెట్ వ‌చ్చిన బాబు అనే మ‌త్స్య‌కారుడికి వాటిని ఇచ్చి.. పులుసు పెట్ట‌డం వ‌చ్చా? అని ప్ర‌శ్నించారు. త‌న‌కంటే కూడా.. త‌న భార్య బాగా పెడుతుంద‌ని.. ఇంటికి రావాల‌ని ఆయ‌న కోర‌డంతో చంద్ర‌బాబు అక్క‌డి నుంచి వారి ఇంటికి వెళ్లారు.

స్వ‌యంగా మ‌త్స్య‌కారుడు బాబు స‌తీమ‌ణికి చేప‌లు ఇచ్చిన సీఎం.. వాటితో పులుసు పెట్టాల‌ని కోరారు. ఆమె సంతోషంగా పులుసుపెట్టింది. ఈ స‌మ‌యంలో మ‌ధ్య మ‌ధ్య చంద్ర‌బాబుకూడా గ‌రిటె తిప్పారు. అనంత‌రం.. వారి యోగ‌క్షేమాలు తెలుసుకున్నారు.

పులుసు వుడ‌క‌డం పూర్త‌య్యాక‌.. స్వ‌యంగా వారితో క‌లిసి భోజ‌నం చేశారు. అప్ప‌టికి సాయంత్రం 5 గంట‌లు అవుతుంది. చంద్ర‌బాబు స్వ‌యంగా త‌న చేత్తోనే పులుసు, చేప ముక్క‌ల‌ను మ‌త్స్య‌కారుడు బాబుకు, వారి కుటుంబ స‌భ్యుల‌కు వ‌డ్డించి.. వారిచ్చిన ప‌ళ్లెంలోనే తాను కూడా భోజ‌నం చేశారు. ఈ ఘ‌ట‌నతో మ‌త్స్య‌కారులు ఫిదా అయ్యారు.

కాగా.. త‌ర‌చుగా ప్ర‌తి నెలా 1న పింఛ‌ను పంపిణీ చేసేందుకు వెళ్లేచంద్ర‌బాబు ల‌బ్ధి దారుల నివాసాల‌ను సంద‌ర్శించ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో వారి ఇళ్ల టీ కాయ‌డం.. తాను తీసుకుని.. కుటుంబ స‌భ్యుల‌కు కూడా ఇవ్వ‌డం తెలిసిందే. కానీ, తొలిసారి చంద్ర‌బాబు చేప‌ల పులుసు వండ‌డం.. త‌నే స్వ‌యంగా మ‌త్స్య‌కారుల‌కు వ‌డ్డింది.. తాను కూడా ఆరగించ‌డం ఇదే తొలిసారి కావ‌డంతో మ‌త్స్య‌కారులు ఫిదా అయ్యారు.

కాగా.. మ‌త్స్య‌కారులతో ప‌ర్య‌ట‌న ఆల‌స్యం కావ‌డంతో చంద్ర‌బాబు త‌న కుప్పం ప‌ర్య‌ట‌న‌ను మానుకున్నారు. కాగా.. బుధ‌వారం చంద్ర‌బాబు బెంగ‌ళూరుకు వెళ్లి.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంత‌ర్జాతీయ కేంద్రంలో నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.

This post was last modified on May 19, 2026 9:45 pm

Share

Recent Posts

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

9 minutes ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

25 minutes ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

2 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

4 hours ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

4 hours ago

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

7 hours ago