Political News

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను అదేవిధంగా నకిలీ మద్యం కేసులోను ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొన్నాళ్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు. అదే సమయంలో ఆయన పై చంద్రబాబు నివాసం పై జరిగిన దాడి కేసు కూడా వెంటాడుతోంది. మరోవైపు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ జోగి మధ్య కూడా అనేక వివాదాలు ఉన్నాయి. పలు కేసులు కూడా నమోదయి కొనసాగుతున్నాయి.

అయినప్పటికీ జోగి రమేష్ ఎక్కడ వెనక్కి తగ్గకపోగా తన ధోరణిని ఆయన కొనసాగిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా మామిళ్ళపల్లిలో రైతులను పరామర్శించేందుకు వెళ్లిన ఆయన మరోసారి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రైతులను ఎలా అడ్డుకుంటారని, రైతులకు గోదాములను ఎలా మూసివేస్తారని ప్రశ్నించడంతోపాటు పోలీసులపై రివర్స్ ధోరణి ప్రదర్శించారు. దీంతో జోగి రమేష్ పై మరో కేసు నమోదు అయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

వాస్తవానికి జోగి రమేష్ గత ఎన్నికల సమయంలో ప‌రాజ‌యం పాలయ్యారు. ప్రస్తుతం మైలవరం నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించాలని చూస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిణామాలను చూస్తే ఆయనకి ఎక్కడా పాజిటివ్ రేటింగ్ అయితే రావడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి కూడా ఆయన అనుకూలంగా ఉన్నట్టు కనిపించడం లేదు. వాస్తవానికి ఎక్కడో గుంటూరు జిల్లాలో జరిగిన పరిణామాలతో ఆయన స్పందించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ తనను తాను అతిగా ఊహించుకుంటున్నారనే వాద‌న వినిపిస్తోంది.

లేకపోతే పార్టీ తరఫున రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగాలని భావిస్తున్నాడో తెలియదు. కానీ, ప్రస్తుతం జోగి రమేష్ వ్యవహారం వైసీపీలో ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. ఆయన దూకుడు తగ్గించుకుంటారా లేకపోతే అట్లాగే కొనసాగుతారా అనేది పార్టీలోనూ చర్చగా మారింది. ఏది ఏమైనప్పటికీ జోగి రమేష్ పై ఇప్పటికే పలు కేసులు నమోదయి ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి మరిన్ని కేసులు నమోదైతే తనకు సింఫతీ పెరుగుతుందని భావిస్తున్నారేమో అనే చర్చ కూడా నడుస్తుండడం గమనార్హం.

This post was last modified on May 19, 2026 5:19 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

6 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

8 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

8 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

9 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

9 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

10 hours ago