ఏపీలో ప్రదాన ప్రతిపక్ష హోదానూ దక్కించుకోలేకపోయిన వైసీపీ… తన పునరాగమనానికి భారీ కసరత్తే చేస్తోంది. అందులో భాగంగా ఏ చిన్న అవకాశం అందివచ్చినా దానిని తనదైన శైలిలో వాడుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గానికి సంబంధించి వైసీపీలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన దేవినేని శ్రీనివాసరావు తన అనుచరవర్గంతో కలిసి గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా మోపిదేవికి వైసీపీ కండువా కప్పిన జగన్… ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జగన్… మోపిదేవికి ఓ రేంజిలో ఎలివేషన్ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచి పార్టీలో చేరుతున్న మోపిదేవికి తాను తప్పకుండా న్యాయం చేస్తానని, భవిష్యత్తులో వైసీపీ అదికారంలోకి వస్తే… మోపిదేవికి తప్పనిసరిగా తగిన గుర్తింపు ఇస్తూ కీలక పదవి అప్పగిస్తానని తెలిపారు. అయితే రేపల్లె అసెంబ్లీ టికెట్ మాత్రం మోపిదేవికి ఇచ్చేది లేదని తేల్చేసిన జగన్… ప్రస్తుతం రేపల్లె వైసీపీ కన్వీనర్ గా కొనసాగుతున్న మోహన కృష్ణను గెలిపించాల్సిన బాధ్యత మోపిదేవిపైనే ఉందని తెలిపారు. ఈ మాట ద్వారా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది లేదని మోపిదేవికి జగన్ నేరుగానే చెప్పినట్టైంది.
ఇక మోపిదేవి శ్రీనివాసరావు విషయానికి వస్తే… ఇంటిపేరులో మోపిదేవి ఉండటంతో ఆయన మాజీ మంత్రి, జగన్ కే కాకుండా వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడిన మోపిదేవి వెంకటరమణకు సమీప బంధువన్న ప్రచారం సాగుతోంది.
ఈ విషయంలో ఏ మేర వాస్తవముందన్న విషయాన్ని పక్కనపెడితే… శ్రీనివాసరావు గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రేపల్లె నుంచే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నోటాకు 1,891 ఓట్లు పోలయితే… నోటాకు పోటీ అన్నట్లుగా శ్రీనివాసరావుకు కేవలం 2,841 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇలాంటి నేతకు జగన్ రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నారన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on May 14, 2026 7:35 pm
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…