జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో చూపించే విషయాలను గమనిస్తే భయం కలుగుతుంది. జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఎవ్వరైనా బెంబేలెత్తిపోతారు.
కానీ అలాంటి చోటికి డబ్బులు పెట్టుకుని ఎవరైనా వెళ్తారా? కానీ దీన్ని శిక్షగా భావించకుండా.. జస్ట్ ఒక ఎక్స్‌పీరియర్స్‌గా భావించి జైలు సందర్శనకు రండి అంటున్నారు హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు అధికారులు. ఈ జైలు ఎంత ఫేమస్ అన్నది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో 16 నెలల పాటు జైలు జీవితం గడిపింది ఇక్కడే.
జగన్ వల్లే ఈ జైలు బాగా పాపులర్ అయిందన్నది వాస్తవం. ఇప్పుడీ జైల్లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు అధికారులు. ఇక్కడ నేరస్థులకు కాకుండా.. ప్రత్యేకంగా సందర్శకుల కోసం ఒక బ్యారక్ ఏర్పాటు చేశారు. జైల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి.. అక్కడ ఉన్న వారి జీవితం ఎలా సాగుతుంది అన్నది అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలంటే రూ.500 కట్టి ఈ జైల్లోకి ఎంటర్ కావచ్చు.
ఫీజు కట్టి జైల్లో వెళ్లాక 24 గంటల పాటు అక్కడే ఉండాలి. ఖైదీలకు ఎలాంటి గదులిస్తారు.. వాళ్లకు సౌకర్యాలు ఎలా ఉంటాయి.. ఖైదీల దిన చర్య ఎలా ఉంటుంది.. వాళ్లక్కడ ఎలాంటి పనులు చేస్తారు.. వివిధ రకాల ఖైదీలను జైలు సిబ్బంది ఎలా ట్రీట్ చేస్తారు.. ఇవన్నీ పరిశీలించే అవకాశం ఉంటుంది. రాత్రి పడుకోవడానికి ఖైదీల తరహాలోనే గదులు ఉంటాయి.
దీంతో పాటు జైల్లోని మ్యూజియంను కూడా సందర్శించవచ్చు. ఐతే ఒకసారి లోపలికి వెళ్లాక 24 గంటల పాటు అక్కడ ఉండలేక, వెనక్కి వచ్చేయాలంటే మాత్రం రూ.1000 ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఇది వినోదం కోసం కాదని.. జైలు జీవితం ఎలా ఉంటుందో సామాన్య ప్రజల్లో అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమం ప్రవేశపెట్టామని తెలంగాణ జైళ్ల శాఖ అధికారులు చెబుతున్నారు.
This post was last modified on May 14, 2026 7:55 pm
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…