Political News

కొత్త బాధ్యతల్లోకి హన్మన్న

కాగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నేత, మాజీ ఎంపీ వి.హన్మంతరావు ఎట్టకేలకు ఓ కీలక బాధ్యతల్లోకి దిగిపోయారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఇటీవలే రేవంత్ రెడ్డి సర్కారు ఆయనను నియమించగా… గురువారం ఆయన ప్రభుత్వ సలహాదారు బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్న కార్యక్రమంలో హన్మన్న కొత్త బాధ్యతల్లోకి ఒదిగిపోయారు.

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వద్ద తనదైన శైలిలో మంచి పలుకుబడి కలిగిన హన్మన్న రాజ్యసభకు మూడు పర్యాయాలు ఎంపికయ్యారు. అయితే 2016 తర్వాత ఆయనకు ఎలాంటి పదవీ దక్కలేదనే చెప్పాలి. 2016లో రాజ్యసభ సభ్యత్వం ముగియగా… అప్పటినుంచి ఆయన ఎలాంటి పదవి లేకుండానే నెట్టుకువస్తున్నారు. అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హన్మన్న… ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూనే సమకాలీన రాజకీయం చేస్తూ సాగుతున్నారు.

బీసీ సామాజిక వర్గానికి చెందిన హన్మన్న ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా సంచలనమే. హన్మన్న నోటి నుంచి వచ్చే హాట్ హాట్ కామెంట్లు జనాన్ని ఇట్టే ఆకట్టుకునేవి. ఇటీవలి కాలంలో తనను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలూ కోకొల్లలే.

అయితే ఆయన బాద అర్థం చేసుకున్నారో, లేదంటే అధిష్టానమే చెప్పిందో తెలియదు గానీ… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవిని అయితే ఇచ్చారు. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన అంశాల్లో ఆయన సలహాలను ప్రభుత్వం తీసుకోనుంది. ఈ హోదాలో హన్మన్న తెలంగాణ కేబినెట్ సమావేశాలకు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

This post was last modified on May 14, 2026 3:54 pm

Share

Recent Posts

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

7 minutes ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

26 minutes ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

33 minutes ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

2 hours ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

3 hours ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

3 hours ago