పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. సభా వేదికపై ఉన్న 98 ఏళ్ల వృద్ధ నాయకుడు మఖన్‌లాల్ సర్కార్ వద్దకు స్వయంగా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆయనకు శాలువా కప్పి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ దృశ్యం సభలో ఉన్న వారినే కాకుండా సోషల్ మీడియాలో చూసిన వారినీ ఆకట్టుకుంది. దీంతో మఖన్‌లాల్ సర్కార్ ఎవరు? ఆయన ప్రత్యేకత ఏమిటి? అనే ఆసక్తి.మొదలైంది.
మఖన్‌లాల్ సర్కార్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, జనసంఘ్–బీజేపీ సిద్ధాంతాలకు జీవితాంతం అంకితమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. 1952లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన కశ్మీర్ తిరంగా ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు. ఆ కాలంలోనే జాతీయవాద భావజాలంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. ఉత్తర బెంగాల్‌లో బీజేపీ బలోపేతానికి కీలకంగా పనిచేశారు.
1981 నుంచి వరుసగా ఏడేళ్ల పాటు జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారు. పార్టీకి పెద్దగా బలం లేని రోజుల్లో గ్రామాగ్రామాన తిరిగి కార్యకర్తలను తయారుచేశారు. కేవలం ఒక్క ఏడాదిలోనే 10 వేల మందిని పార్టీలో చేర్పించి విశేష గుర్తింపు పొందారు.
పార్టీ కోసం జీవితాంతం కష్టపడిన అట్టడుగు స్థాయి కార్యకర్తలను బీజేపీ ఎప్పటికీ మరచిపోదనే సందేశాన్నే ప్రధాని మోదీ తన చర్యతో ఇచ్చారని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. సాధారణ కార్యకర్త నుంచి జాతీయ స్థాయిలో గౌరవం పొందిన మఖన్‌లాల్ సర్కార్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on May 9, 2026 5:30 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…