Movie News

పెద్ది భోపాల్ ఎందుకు ఎంచుకున్నాడు

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ట్రైలర్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్ ఇంకో పాతిక రోజుల్లోనే ఉండటంతో ప్రమోషన్లు ఊపందుకోవాలంటే ముందీ లాంఛనం జరిగిపోవాలి. ముఖ్యంగా నార్త్ ఇండియా మార్కెట్ లో బజ్ పెరగాలంటే ఇది సక్సెస్ కావడం చాలా కీలకం. వృద్ధి, మైత్రి, సుకుమార్ రైటింగ్ బృందాలు ప్రస్తుతం ఈ ప్రణాళికలోనే ఉన్నాయి. భోపాల్ లో వేడుక నిర్వహించాలని ఫిక్స్ అయినట్టుగా గట్టిగా వినిపిస్తోంది.

భోపాల్ ఎందుకు ఎంచుకుంటున్నారనే ప్రశ్నకు సమాధానం లేకపోలేదు. గతంలో పుష్ప 2 ది రూల్ మొదటి ఈవెంట్ బీహార్ లో చేస్తామని ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అల్లు అర్జున్ కు ఫాలోయింగ్ ఉన్న కేరళ వదిలేసి ఇంకో చోటకి వెళ్లడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఊహించని విధంగా ఆ వేడుక గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బన్నీని ప్రత్యక్షంగా చూసిన జనాలు ఎగబడి వచ్చారు. నిర్వాహకులు ఊహించిన దానికన్నా గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

ఇప్పుడు పెద్దికి అలాంటి పుష్ కావాలి. చికిరి చికిరి పాట పుణ్యమాని చరణ్ ఉత్తరాదిలో బాగా చొచ్చుకుపోయాడు. ఆర్ఆర్ఆర్ టైంలోనే ఇమేజ్ వచ్చినప్పటికీ గేమ్ ఛేంజర్ వల్ల అది కొంచెం ప్రభావితం చెందింది. సో మళ్ళీ నార్త్ లో చరణ్ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే గట్టిగా సౌండ్ చేయాలి. దానికి ట్రైలర్ లాంచ్ కన్నా మంచి వేదిక దొరకదు. భోపాల్ లో చేస్తే అక్కడి మీడియా కవరేజ్ తో పాటు హిందీ ప్రేక్షకుల మద్దతు దొరుకుతుంది.

ప్రస్తుతం పెద్ది ఓవర్సీస్ కలెక్షన్లతో సిక్సర్లు కొడుతున్నాడు. ఆల్రెడీ రెండు లక్షల డాలర్లకు దగ్గరగా ఉండగా మొదటి వీకెండ్ అయ్యేలోపు అర మిలియన్ వస్తుందని డిస్ట్రిబ్యూటర్ నమ్మకం. ఇంకా మూడు వారాలు టైం ఉంది కాబట్టి మూడు మిలియన్ ముద్ర పడుతుందనే ధీమాలో అభిమానులున్నారు. భోపాల్ లో జరిగే ఈవెంట్ మే 16 లేదా 17 ఉండొచ్చు. అధికారిక ప్రకటన ఏ క్షణమైనా వచ్చేలా ఉంది. ఇక్కడి నుంచి పబ్లిసిటీ నాన్ స్టాప్ గా ఉండాల్సిందే.

This post was last modified on May 9, 2026 4:57 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

1 hour ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

3 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

3 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

3 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

3 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

5 hours ago