Political News

రాకెట్ లా దూసుకుపోతున్న దళపతి పార్టీ

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర ఫలితాలు నమోదయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా మారిపోతున్నాయి. ప్రత్యేకించి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒకటి, అరా ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేసినట్లుగా సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా దూసుకుపోతున్నారు. విజయ్ పార్టీ తమిళ వెట్రిగ కజగం (టీవీకే)… అటు అధికార డీఎంకే, ఇటు ప్రతిపక్షం అన్నాడీఎంకేలను కిందకు నెట్టేసి రాకెట్ లా దూసుకుపోతోంది.

ఉదయం 11 గంటల సమయానికి విజయ్ పార్టీ ఏకంగా 130 సీట్లలో ఆధిక్యం సాధించింది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా… ఎర్లీ ట్రెండ్స్ లో టీవీకే ఏకంగా 108 సీట్లలో ఆదిక్యంలో కొనసాగుతోంది. ఇక మరోమారు అధికారం ఖాయమని మెజారిటీ సర్వే సంస్థలు చెప్పిన డీఎంకే మూడో స్థానంలో కదులుతోంది. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రస్తుతానికి కేవలం 50 సీట్లలోనే ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇక ఈ దఫా విజయం ఖాయమని భావించిన అన్నాడీఎంకే… విజయ్ పార్టీకి అల్లంత దూరాన నిలుస్తూ 76 సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తోంది.

ఈ ఎర్లీ ట్రెండ్స్ చివరి దాకా కొనసాగితే…తమిళనాడు రాజకీయ చరిత్రలోనే కాకుండా భారత దేశ రాజకీయ చరిత్రలోనే మరో రికార్డు లిఖితం కానుంది. సినిమాల నుంచి నేరుగా రాజకీయాల్లోకి వచ్చి విజయాలు సాధించిన వారు ఇప్పటిదాకా ఇద్దరే ఉన్నారు. వారిలో ఎంజీఆర్ తమిళనాడులో విజయం సాధిస్తే… ఎన్టీఆర్ ఏపీలో రికార్డు విజయాన్ని అందుకున్నారు. వీరి తర్వాత చాలా మంది సినిమా స్టార్లు రాజకీయాల్లోకి వచ్చినా… వారంతా బొక్కబోర్లా పడిపోయారు. తాజాగా తమిళనాడు రాజకీయ యవనికలో సునామీలా దూసుకువచ్చిన విజయ్… ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే… ఎంజీఆర్, ఎన్టీఆర్ సరసన ఆయన చోటు దక్కించుకోనున్నారు.

This post was last modified on May 4, 2026 11:44 am

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

2 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

3 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

4 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

5 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

7 hours ago