Movie News

సందీప్ కిషన్ మూవీకి టెన్షన్ లేదు

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా భార్య సంగీతతో విడాకుల వ్యవహారం, త్రిష పదే పదే విజయ్ ఈవెంట్స్ లో కనిపించడం లాంటివి వాటికి మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే దీని ప్రభావం విజయ్ కొడుకు సంజయ్ జేసన్ దర్శకత్వం వహించిన సిగ్మా మీద పడుతుందేమోననే అనుమానం అభిమానుల్లో లేకపోలేదు. దానికి పూర్తి క్లారిటీ వచ్చేసింది.

ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలలో సంజయ్ జేసన్ తన తండ్రి గురించి ఓ రేంజ్ లో పొగడ్తలు గుప్పించాడు. ఇద్దరి మధ్య అనుబంధంతో పాటు గతంలో ఆయనతో ఉన్న సినిమా జ్ఞాపకాలు నెమరు వేసుకోవడమే కాదు, స్వంతంగా ఎదగమని నాన్న ఇచ్చిన సలహా, ఏదైనా అవసరం పడితే తనను పిలవమని చెప్పిన వైనం ఇవన్నీ వివరించాడు. అంతే కాదు విజయ్ హీరోగా జాసన్ స్టాధం కలయికలో ఒక మల్టీస్టారర్ తీయడం తన కలగా చెప్పుకున్నాడు. ట్రోలింగ్ జరిగినా ఇదే మాట చెబుతా అన్నాడు.

మొత్తానికి జేసన్ సంజయ్ ఇంత ఓపెన్ అయ్యాక విజయ్ అభిమానుల నుంచి మద్దతు దక్కకుండా ఉంటుందా. నిజానికి సిగ్మా జూలై చివరిలో విడుదల కావాల్సింది. అయితే జన నాయగన్ కు కేవలం వారం గ్యాప్ లో వస్తే ఇబ్బందవుతుందని భావించడంతో పాటు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రభంజనాన్ని ముందే ఊహించి తప్పుకున్నారు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో బోలెడు ట్విస్టులు, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయట.

సిగ్మా కొత్త విడుదల తేదీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈ నెల క్రేజీ రిలీజులు ఉండటంతో సెప్టెంబర్ లేదా అక్టోబర్ వైపు చూస్తున్నట్టు తెలిసింది. జన నాయకుడు ఎంత ఫ్లాప్ అయినా రెండు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసింది. అది విజయ్ స్టార్ డం పవర్. ఇప్పుడు ఆయన కొడుకు దర్శకుడిగా మారి తెరకెకెక్కించిన సినిమాకు ఖచ్చితంగా వాళ్ళ మద్దతు ఉంటుంది. కంటెంట్ కనక బాగుంటే నెత్తిన బెట్టుకుంటారు. ఎలాగూ సందీప్ కిషనే హీరో కాబట్టి తెలుగులోనూ మంచి బజ్ వస్తుంది. 

This post was last modified on August 1, 2026 4:57 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

26 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago