నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయంలో ఉంటే, కొన్ని వారాల క్రితం జరిగిన హెచ్డి ప్రింట్ పైరసీ దాన్ని మరింత రెట్టింపు చేసింది. ఒకవైపు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విజయ్ ని ఈ పరిణామం బాధించినప్పటికీ అది బయట పెట్టకుండా ధైర్యంగా క్యాంపైన్ కోసం ముందుకు వెళ్లిపోయారు. కట్ చేస్తే ఇప్పుడు కీలకమైన కౌంటింగ్ డేట్ వచ్చేసింది.
వంద సీట్లకు పైగా ఆధిక్యంలో ఉన్న విజయ్ కింగ్ మేకర్ కావడం దాదాపు ఫిక్స్. ఎవరి మద్దతు అవసరం లేని మేజిక్ నెంబర్ ని ఒక్కడే చేరుకుంటాడనే నమ్మకం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ అవసరమైన పక్షంలో దానికి సంబంధించిన చర్చలు, మంత్రాంగాలు తెర వెనుక ఆల్రెడీ మొదలైపోయాయి. ఇప్పుడు జన నాయకుడు రిలీజ్ కు రాజమార్గం దొరికేసింది. రూలింగ్ పార్టీ సిఎం సినిమా అంటే అడ్డంకులు వాటంతట అవే తొలగుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
చెప్పాలంటే స్క్రీన్ మీద నాయకుడిగా కంటే పొలిటికల్ నాయకుడిగా విజయ్ అద్భుత విజయం సాధించే దిశగా పరుగులు పెడుతున్నారు. అడుగుపెట్టిన మొదటి దఫాలోనే అధికారం దక్కించుకున్న హీరోల్లో ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత స్థానాన్ని సొంతం చేసుకోబోతున్నారు. తన పాలన ఎలా ఉంటుంది, చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తారా లేదానేది తేలడానికి ఇంకో అయిదు సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే ఒక అంచనాకు రాలేం.
పరిస్థితి గమనిస్తే మే మూడు లేదా నాలుగో వారంలో జన నాయకుడు థియేటర్లలోకి వచ్చేస్తుంది. విజయ్ సిఎం అయ్యే పక్షంలో ఈ సినిమాకు ఏ స్థాయిలో స్వాగతం దొరుకుతుందో ఊహలకు అందటం కష్టం. మామూలుగానే ఓపెనింగ్స్, కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టే విజయ్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఏ ప్రకంపనలు సృష్టిస్తాడో ఊహించుకోవడం సులభం కాదు. భగవంత్ కేసరి రీమేక్ అయిన జన నాయకుడుని తమిళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా విడుదల చేస్తారు.
This post was last modified on May 4, 2026 12:10 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…