Movie News

టాక్సిక్ ట్రైలర్ మీద కోట్ల కళ్లున్నాయి

కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్ డైరెక్టర్లతో చేసే ఛాన్స్ ఉన్నా కథ నచ్చితే తప్ప ఒప్పుకోనని భీష్మించుకు కూచున్నాడు. దీని వల్ల కొన్ని క్రేజీ ఆఫర్స్ చేజారాయనే టాక్ బెంగళూరు వర్గాల్లో ఉంది. అయినా సరే తనకొచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ కాపాడుకునేందుకు యష్ ఎంత టైం ఖర్చు పెట్టేందుకైనా సిద్ధంగా ఉన్నాడు. అందుకే దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పేరు కన్నా యష్ పేరు మీదే మార్కెటింగ్ జరుగుతోంది.

ఆగస్ట్ 8 టాక్సిక్ ట్రైలర్ రానుంది. బెంగళూరులో చాలా గ్రాండ్ ఈవెంట్ ద్వారా లాంచ్ చేయబోతున్నారు. దీని మీద కోట్ల కళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ వర్గాలు టాక్సిక్ పట్ల విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నాయి. దురంధర్ తర్వాత ఆ స్థాయిలో హిందీ బాక్సాఫీస్ కు ఊపు తెచ్చిన సినిమా లేదు. ఒకటి రెండు బాగానే ఆడాయి కానీ కనీసం అయిదు వందల కోట్లు వసూలు చేసే బొమ్మ గత మూడు నెలల్లో రాలేదు. అది టాక్సిక్ వల్లే సాధ్యమవుతుందని వాళ్ళ నమ్మకం.

కేవలం ఒక వీడియోగా జనాలు దీన్ని చూడటం లేదు. డిస్ట్రిబ్యూటర్లు పెడుతున్న వందల కోట్ల పెట్టుబడికి న్యాయం జరుగుతుందనే మొదటి హామీ ట్రైలర్ లో దక్కాలి. అంతే కాదు ఓపెనింగ్స్ లో చాలా కీలక పాత్ర పోషించే మొదటి రెండు రోజులకు సంబంధించిన కలెక్షన్లు బలంగా రావాలంటే, ఫ్యాన్స్ కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా టికెట్ రేట్లు ఎంత ఉన్నా మొదటి వారంలోనే చూసేయాలన్నంత హైప్ తెచ్చుకోవాలి. అది ట్రైలర్ తోనే సాధ్యం.

అందుకే అది ఎలా వచ్చిందన్న ఎగ్జైట్ మెంట్ అందరిలోనూ ఉంది. పైగా కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, నయనతార అంటూ క్యాస్టింగ్ మొత్తం లేడీస్ తో నింపేసిన గీతూ మోహన్ దాస్ ఇప్పటిదాకా వదిలిన పాటల్లో బోల్డ్ రొమాన్స్ పెట్టేశారు. యాక్షన్ బ్లాక్స్ దాచి పెట్టారు. ట్రైలర్ లో ఏమేరకు రివీల్ చేస్తారో చూడాలి. ఆగస్ట్ 26 ఎంతో దూరంలో లేదు. కేవలం పాతిక రోజుల్లో టాక్సిక్ సునామి థియేటర్లలో అడుగు పెడుతుంది. రవి బస్రూర్ సంగీతం మెయిన్ అట్రాక్షన్ గా చెబుతున్నారు. 

This post was last modified on August 1, 2026 11:15 pm

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

55 minutes ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

2 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

2 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

2 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

3 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

4 hours ago