Movie News

ఎదిగే స్టేజిలో అలాంటి ఆలోచనలే రిస్కు

హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై కోట్ల గ్రాస్ కి చేరుకోవడం టీమ్ మొత్తాన్ని సంతోషంలో ముంచెత్తింది. నిర్మాత అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం హాఫ్ సెంచరీ దాటేసింది. ఇదిలా ఉండగా ఇవాళ నిర్వహించిన ప్రెస్ మీట్ లో నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ కిరణ్ ని ఫ్యాక్షన్ కథలో రెడ్డి గెటప్ తో చూడాలని ఉందని, వచ్చే ఏడాది ఆ బ్యాక్ డ్రాప్ తో ఒక హిట్టు కొడదామని అన్నారు.

వినడానికి బాగానే ఉంది కానీ కిరణ్ ఇప్పుడున్న ఎర్లీ స్టేజిలో ఇలాంటివి ఖచ్చితంగా రిస్క్ అవుతాయి. ఎందుకంటే కత్తులు నరుక్కునే ఫ్యాక్షన్ కథలు ఇప్పుడు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. అందుకే ఎవరూ టచ్ చేయడం లేదు. అరవింద సమేత వీర రాఘవ ఈ జానర్ లో వచ్చిన లాస్ట్ హిట్ మూవీ. జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య, చిరంజీవి లాంటి మాస్ కటవుట్లకు ఫ్యాక్షన్లు బాగుంటాయి కానీ కిరణ్ వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుని చేస్తే వర్కౌట్ కాకపోతే ప్రమాదమే ఎక్కువ.

తనకున్న సాఫ్ట్ ఇమేజ్ మరింత పెరిగేలా సబ్జెక్టులను ఎంచుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పక్కింటి మిడిల్ క్లాస్ కుర్రాడిగా కనిపించే ఇతని ఫీచర్స్ లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాలకు బాగుంటాయి. కమర్షియల్ జోలికి వెళ్తే ఏమవుతుందో దిల్ రుబా నిరూపించింది. ప్రేమకథలో బలవంతంగా హీరోయిజంని జొప్పించడం రివర్స్ అయ్యింది. క, కె ర్యాంప్ లో వాటి జోలికి వెళ్ళకపోవడం సూపర్ హిట్స్ తెచ్చింది. చెన్నై లవ్ స్టోరీ కూడా అంతే.

నెక్స్ట్ తన దర్శకత్వంలోనే సినిమా చేస్తున్న కిరణ్ అబ్బవరం అందులో చెఫ్ గా కనిపించనున్నాడు. ఇది కూడా రియాలిటీకి దగ్గరగా ఉన్న క్యారెక్టర్ కావడంతో టైటిల్ కూడా రియాలిటీ అని పెడతారని ఇన్ సైడ్ టాక్. ఇది సక్సెస్ అయితే కిరణ్ ఒక అరుదైన ఘనత అందుకున్నట్టే. ఇప్పుడున్న జనరేషన్లో సీనియర్లు జూనియర్లు చాలా తక్కువ మంది మెగా ఫోన్ చేపడుతున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే కిరణ్ చాలా త్వరగా డైరెక్షన్ చేస్తున్నట్టే. చూడాలి ఏం రిజల్ట్ అందుకుంటాడో. 

This post was last modified on August 1, 2026 8:20 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

1 hour ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

3 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

5 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago