Political News

అజహరుద్దీన్ మినిస్ట్రీపై వీడిన సస్పెన్స్

తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారంపై మూడేళ్లుగా వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ తో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ నామినేషన్లను గవర్నర్ ఆమోదించలేదు. మరోవైపు, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రిగా అజహరుద్దీన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 6 నెలలు పూర్తి కావస్తోంది. అజ్జు భాయ్ మంత్రి పదవి చేపట్టి ఈ ఏప్రిల్ 30 నాటికి 6 నెలలు పూర్తవుతుంది.

ఈ లోపు ఎమ్మెల్సీగా అజహరుద్దీన్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుంటే మంత్రి పదవి కోల్పోయే ఛాన్స్ ఉంది. ఈ వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డికి చిక్కులు తెచ్చి పెట్టింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లాతో రేవంత్ భేటీ అయ్యారు. అజారుద్దీన్, కోదండరామ్‌ల ఎమ్మెల్సీ నామినేషన్ ఫైల్‌ను ఆమోదించాలని గవర్నర్ శుక్లాకు విజ్ఞప్తి చేశారు. అయితే, గవర్నర్ ఆ ఇద్దరికీ లైన్ క్లియర్ చేస్తారా లేదా అన్న విషయంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ ఏర్పడింది.

ఆ సస్పెన్స్ కు తెర దించుతూ అజహరుద్దీన్, కోదండరాంలకు గవర్నర్ శుక్లా పచ్చజెండా ఊపారు. రేవంత్ కేబినెట్ ప్రతిపాదించిన అజారుద్దీన్, కోదండరాం అభ్యర్థిత్వాలను ఆమోదిస్తూ గవర్నర్ శుక్లా సంతకం చేశారు. త్వరలోనే అందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.

ఒక వేళ ఏప్రిల్ 30లోపు ఆ ఇద్దరి నామినేషన్ ను గవర్నర్ శుక్లా ఆమోదించకుంటే అజహరుద్దీన్ తో రాజీనామా చేయించి మళ్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని కూడా రేవంత్ ఆలోచించారట. ఆ అవసరం లేకుండానే మార్గం సుగమం కావడంతో రేవంత్ తో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఊపిరి పీల్చుకున్నాయి.

This post was last modified on April 25, 2026 3:06 pm

Share

Recent Posts

మేన‌మామ ఉంగ‌రం విలువ 750 కోట్లు

రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న ఉచిత ప‌థ‌కాల‌కు త‌మిళ‌నాడు కేరాఫ్‌గా ఉంది. నాటి జ‌య‌ల‌లిత, క‌రుణానిధి ప్ర‌భుత్వాల నుంచి నేటి…

7 minutes ago

దుమారం రేపిన ద‌ర్శ‌కుడి తండ్రి ఇంట‌ర్వ్యూ

త‌మిళంలో పేరున్న ద‌ర్శ‌కుల్లో వెంక‌ట్ ప్ర‌భు ఒక‌రు. చెన్నై-28తో మొద‌లుపెట్టి చాలా హిట్లే ఇచ్చారు. చివ‌ర‌గా విజ‌య్ హీరోగా గ్రేటెస్ట్…

16 minutes ago

సీట్లన్నీ గెలిచినా ఈవీఎంలకు వ్యతిరేకమే

ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లపై చాలా సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది. ఈవీఎంలు ట్యాంపర్ చేయడం సాధ్యమేనని కొందరు ప్రోటోటైప్ ఈవీఎంలను ట్యాంపర్…

40 minutes ago

కీలక జిల్లాలు చేజారిపోతున్నాయి జగన్

రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడొకప్పుడు బెడిసికొట్టడం సహజం. కానీ, ఒక ఉమ్మడి జిల్లాలో పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగి పావులు…

1 hour ago

డైరెక్ట‌ర్ ఏడిస్తే… హీరోనే డైరెక్ట్ చేసుకున్నాడ‌ట‌

కొన్నిసార్లు ద‌ర్శ‌కులు క‌థ చెప్పినంత బాగా సినిమా తీయ‌లేక‌పోతుంటారు. అందుకు అనుభ‌వ లేమి కూడా కార‌ణం కావ‌చ్చు. లేదంటే రాత…

2 hours ago

ఖైరతాబాద్ లో కవిత? చీల్చడానికేనా?

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో కవిత…

2 hours ago