Political News

కీలక జిల్లాలు చేజారిపోతున్నాయి జగన్

రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడొకప్పుడు బెడిసికొట్టడం సహజం. కానీ, ఒక ఉమ్మడి జిల్లాలో పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగి పావులు కదుపుతున్నా, ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యం కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితి పూర్తిగా చేజారిపోతోందన్న గుసగుసలు కేడర్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అసలు హైకమాండ్ ఆశించిన లక్ష్యాలకు, గ్రౌండ్‌ లెవల్‌లో జరుగుతున్న పరిణామాలకు మధ్య పొంతన కుదరకపోవడానికి అసలు కారణాలేంటి?

అధిష్టానం ఎంచుకున్న మార్పులు, చేర్పులు రివర్స్ గేర్ వేస్తున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. కాలం చెల్లిన నాయకులను పక్కన పెట్టి, కొత్తవారికీ, యువతకూ అవకాశం ఇస్తే పార్టీ పుంజుకుంటుందని అధిష్టానం భావించింది. అందులో భాగంగానే భీమవరం, పాలకొల్లు, ఉండి, చింతలపూడి, కొవ్వూరు, గోపాలపురం, ఆచంట వంటి కీలక నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లను మార్చడం, ప్రయోగాలు చేయడం జరిగింది. అయితే ఈ ప్రయోగాలన్నీ ఒక్కొక్కటిగా వికటిస్తున్నట్లు కనిపిస్తోంది. సీనియర్లు పక్కకు తప్పుకోవడం లేదా పార్టీని వీడడం జరగగా, కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇన్‌ఛార్జ్‌లు మాత్రం క్షేత్రస్థాయిలో కేడర్‌ను కలుపుకునిపోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు.

అందుబాటులో లేని నాయకత్వం

పార్టీ ఆదేశించినప్పుడు మీడియా ముందు గొంతు కలపడం మినహా, మిగతా సమయాల్లో సదరు ఇన్‌ఛార్జ్‌లు ప్రజలకు గానీ, కష్టపడే కార్యకర్తలకు గానీ అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో ఉన్న కూటమి నేతల వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో వైసిపి నాయకులు పూర్తిగా వెనుకబడ్డారు. కనీసం ప్రశ్నించే ధైర్యం కూడా చేయలేకపోతున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ బలం ఉన్నప్పటికీ, దాన్ని నడిపించే సమర్థవంతమైన లీడర్‌షిప్ కొరవడడంతో కేడర్ తీవ్ర నిరాశలో కూరుకుపోయింది.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలకు తావివ్వకూడదని, ప్రతిచోటా గట్టి పోటీ ఇవ్వాలని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం ఈ ఆదేశాలు అమలుకు నోచుకునేలా కనిపించడం లేదు. ఎన్నికల బరిలో నిలిస్తే అధికార పార్టీ నుంచి వచ్చే ఒత్తిడిని ఎదుర్కొనేందుకు జిల్లా ఇన్‌ఛార్జ్‌లు, అధ్యక్షుల నుంచి ఎలాంటి భరోసా, మద్దతు లభించడం లేదని స్థానిక నాయకులు వాపోతున్నారు. తమకు అండగా నిలవాల్సిన పెద్దలే వెనకడుగు వేస్తుంటే, తాము మాత్రం ఎందుకు రిస్క్ చేయాలనే ధోరణిలో కేడర్ ఉండిపోయింది.

ఇక నియోజకవర్గాల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే సాహసం చేయడం లేదు జిల్లా నాయకులు. ఒకవేళ లోపాలను నిజాయితీగా రిపోర్ట్ చేస్తే, తమ పదవులకు ఎక్కడ ఎసరు వస్తుందోనన్న భయంతో ‘అంతా సవ్యంగానే ఉంది’ అంటూ హైకమాండ్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో కష్టపడేవారికి గుర్తింపు దక్కడం దేవుడెరుగు… కేవలం అదృష్టం కొద్దీ తెరపైకి వచ్చే నామినేటెడ్ నేతల పట్ల మాత్రమే పార్టీ ఆధారపడాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ డ్యామేజ్‌ను సరిదిద్దడానికి జగన్ ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

This post was last modified on September 29, 2026 8:04 am

Share

Recent Posts

ఖైరతాబాద్ లో కవిత? చీల్చడానికేనా?

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో కవిత…

37 minutes ago

జైలుకే ఎక్కువ సార్లు వెళ్ళాను

నేను అసెంబ్లీకి వెళ్లిన దానికంటే జైలుకు వెళ్లిన రోజులే ఎక్కువగా ఉన్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట…

40 minutes ago

సోమిరెడ్డి ఇలాకాలో నువ్వా – నేనా

నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైసీపీల మధ్య తీవ్ర రాజకీయ పోటీ నడుస్తోంది. ప్రస్తుత…

3 hours ago

70 వయసులో అదిరిపోతున్న ‘చిరు’ ప్లానింగ్

ఇప్పటి స్టార్ హీరోల కెరీర్లు చూస్తున్నాం. జీవిత కాలంలో మహా అయితే ఇరవై నుంచి నలభై సినిమాలు చేస్తే గొప్పనేలా…

6 hours ago

ఇరుముడి వేట అయిపోలేదు స్వామి

ప్యారడైజ్ వచ్చేసింది కాబట్టి వేరే ఏ సినిమాలకు జనాలు లేరనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓటిటిలో వచ్చాక కూడా ఇరుముడి ఇంకా…

10 hours ago

బాలయ్య మనసు మారితే బాక్సాఫీస్ యుద్ధమే

డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి.…

10 hours ago