రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలకు తమిళనాడు కేరాఫ్‌గా ఉంది. నాటి జయలలిత, కరుణానిధి ప్రభుత్వాల నుంచి నేటి విజయ్ సర్కారు వరకు తమిళనాడు ప్రజలకు ఉచిత పథకాలు అమలు చేసే విధానం కొనసాగుతూనే ఉంది. తాజాగా మేనమామ బంగారపు ఉంగరం పేరుతో సీఎం విజయ్ కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఏకంగా 755 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. ఇది రాష్ట్ర బడ్జెట్‌లో కీలక భాగంగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది విద్యుత్‌కు కేటాయించిన 650 కోట్ల రూపాయల బడ్జెట్ కంటే కూడా ఎక్కువగా ఉండడంతో దీనిపై విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు కేంద్రం నుంచి ఆర్బీఐ నుంచి కూడా భారీ ఎత్తున అప్పులు చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు మండుతున్నాయని.. ఈ సమయంలో ఉచితాలకు ఖర్చు చేసే సొమ్మును నిత్యావసర సరుకుల ధరలకట్టడికి కేటాయించాలని కోరుతున్నారు. ఇదిలావుంటే.. సీఎం విజయ్ సోమవారం చెన్నైలోని రాజాజీ ఆసుపత్రిలో మేనమామ బంగారం ఉంగరం పథకాన్ని ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దీనిని అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 22వ తేదీన ఆ తర్వాత పుట్టిన చిన్నారులకు ఈ పథకాన్ని అమలు చేస్తారు. తాజాగా 650 కోట్ల రూపాయలను ఈ పథకానికి విడుదల చేశారు.
ఇక, ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు మహిళలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేరాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలుచేసుకునే వారికి ఈ పథకం వర్తిస్తుంది. అయితే.. దీనిపై డీఎంకే మౌనంగా ఉండగా.. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కమ్యూనిస్టులు పెదవి విరుస్తున్నారు. ఒకవైపు కరువు పీడిత ప్రాంతాల్లో రైతులకు ఇబ్బందులు పెరుగుతున్నాయని వారిని ఆదుకునేందుకు ఈ నిధులు కేటాయిస్తే బాగుండేదని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. సీఎం విజయ్ కార్యాలయం మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం ప్రభుత్వంపై బాధ్యత ఉంటుందని పేర్కొనడం గమనార్హం.
This post was last modified on September 29, 2026 8:09 am
తమిళంలో పేరున్న దర్శకుల్లో వెంకట్ ప్రభు ఒకరు. చెన్నై-28తో మొదలుపెట్టి చాలా హిట్లే ఇచ్చారు. చివరగా విజయ్ హీరోగా గ్రేటెస్ట్…
ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లపై చాలా సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది. ఈవీఎంలు ట్యాంపర్ చేయడం సాధ్యమేనని కొందరు ప్రోటోటైప్ ఈవీఎంలను ట్యాంపర్…
రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడొకప్పుడు బెడిసికొట్టడం సహజం. కానీ, ఒక ఉమ్మడి జిల్లాలో పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగి పావులు…
కొన్నిసార్లు దర్శకులు కథ చెప్పినంత బాగా సినిమా తీయలేకపోతుంటారు. అందుకు అనుభవ లేమి కూడా కారణం కావచ్చు. లేదంటే రాత…
తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో కవిత…
నేను అసెంబ్లీకి వెళ్లిన దానికంటే జైలుకు వెళ్లిన రోజులే ఎక్కువగా ఉన్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట…