Movie News

ప్రభాస్ ఫ్యాన్స్.. ఇటు సంతోషం, అటు బాధ

ఈ వారం తెలుగులో చెప్పుకోదగ్గ కొత్త రిలీజ్‌లు లేవు. కానీ థియేటర్లలో సందడి కనిపిస్తోంది. అలా అని ముందు వారాల్లో వచ్చిన సినిమాలు ఆడుతున్నాయా అంటే అదీ లేదు. ఎప్పుడో 16 ఏళ్ల ముందు వచ్చిన ‘డార్లింగ్’ పుణ్యమా అని థియేటర్లు జనాలతో కళకళలాడుతున్నాయి.

టాలీవుడ్లో కొన్నేళ్ల నుంచి రీ రిలీజ్‌ ట్రెండు నడుస్తున్న సంగతి తెలిసిందే. అలా అని రిలీజ్ చేసిన ప్రతి పాత సినిమా ఆడేస్తోందా అంటే అదేమీ లేదు. ఈ నెల మొదటి వారంలో వచ్చిన అల్లు అర్జున్ మూవీ ‘రేసుగుర్రం’ ఆశించిన స్పందన తెచ్చుకోలేకపోయింది. కానీ ‘డార్లింగ్’ కోసం ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు న్యూట్రల్ ఆడియన్స్ కూడా థియేటర్లకు వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

సింగిల్ స్క్రీన్లలో ప్రభాస్ అభిమానుల హంగామా మామూలుగా లేదు. ఇదేమీ ప్రభాస్ పుట్టిన రోజు లాంటి స్పెషల్ అకేషన్లో రిలీజైన సినిమా కాదు. పైగా వారం మధ్యలో, వీక్ డేకి షోలు పడ్డాయి. అయినా థియేటర్లలో సెలబ్రేషన్స్ మామామూలుగా లేవు. హైదరాబాద్‌లో అయితే సంబరాలు వేరే స్థాయికి చేరుకున్నాయి.

‘డార్లింగ్’లో వింటేజ్ ప్రభాస్‌ను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. కానీ ఇదే సమయంలో వారిని ఒక ఆవేదన వెంటాడుతోంది. సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ పోస్టులు చూస్తే వారి బాధ అర్థమవుతుంది. ఎలా ఉండే ప్రభాస్ ఎలా అయిపోయాడు అన్నది వారి బాధ.

ఒకప్పుడు మిడ్ రేంజ్ హీరోగా ఉండగా తెరపై అంత హుషారుగా, ఎంతో ఎనర్జీతో కనిపించిన ప్రభాస్.. ఇప్పుడు బిగ్గెస్ట్ పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా ఎదిగాక స్క్రీన్ మీద కనిపిస్తున్న వైనాన్ని పోల్చి చూసుకుంటున్నారు. లుక్ విషయంలో ప్రభాస్ ‘ది బెస్ట్’గా కనిపించిన చిత్రాల్లో ‘డార్లింగ్’ ఒకటి. అందులో తన స్టైలింగ్ అదిరిపోతుంది. మరే సినిమాలో లేనంత డ్యాన్సులు ఇందులో చూడొచ్చు.

సినిమాలో ఉన్నవి రెండే యాక్షన్ సీక్వెన్సులైనప్పటికీ.. అవి ఒక రేంజిలో పండాయి. ఆ ఫైట్స్ కోసం ప్రభాస్ పెట్టిన ఎఫర్ట్ అంతా తెరపై కనిపిస్తుంది. వాటి ఎలివేషనే వేరుగా ఉంటుంది. కానీ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన సినిమాల్లో చాలా వరకు తన లుక్స్ బాలేవన్నది వాస్తవం. వాయిస్ కూడా తేడా కొట్టేసింది. ఇక డ్యాన్సులు, ఫైట్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

సీజీ, డూప్ వాడకం పుణ్యమా అని.. ప్రభాస్ లుక్, ఫైట్స్ సహా ప్రతి విషయంలోనూ అనుమానంగా చూసే పరిస్థితి వచ్చేసింది. అతను ఒకప్పట్లా ఎఫర్ట్ పెట్టట్లేదన్నది తనపై ఉన్న అతి పెద్ద కంప్లైంట్. వయసు పెరిగే కొద్దీ ఎనర్జీ తగ్గడం, లుక్స్ మారిపోవడం సహజమే కానీ.. ప్రభాస్ మరీ సున్నితంగా తయారవడం, ఎఫర్ట్ పెట్టడంలేదు అనే వార్తల వల్ల చాలా నెగెటివిటీ వచ్చేసింది.

‘ది రాజాసాబ్’ రిలీజ్ టైంలో న్యూట్రల్ ఆడియన్స్‌తో పాటు అభిమానుల్లోనూ అసంతృప్తి బయటపడిపోయింది. ఈ ఫీడ్ బ్యాక్ ప్రభాస్‌కు కూడా చేరే ఉంటుందని.. తర్వాతి సినిమాల విషయంలో అతను జాగ్రత్త పడతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇప్పుడు అభిమానులతో పాటు తానూ ‘డార్లింగ్’ సినిమాను చూస్తే ఒకప్పుడు ఎలా కనిపించేవాడు, ఎంత ఎఫర్ట్ పెట్టేవాడు అన్నది ప్రభాస్‌కు కూడా అర్థమై, తర్వాతి చిత్రాల కోసం తానేం చేయాలో రెబల్ స్టార్‌కు మరింత బాగా అర్థమయ్యే అవకాశముంటుంది.

This post was last modified on April 25, 2026 12:37 pm

Share

Recent Posts

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

17 minutes ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

27 minutes ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

3 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

3 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

4 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

4 hours ago