Movie News

దుమారం రేపిన ద‌ర్శ‌కుడి తండ్రి ఇంట‌ర్వ్యూ

త‌మిళంలో పేరున్న ద‌ర్శ‌కుల్లో వెంక‌ట్ ప్ర‌భు ఒక‌రు. చెన్నై-28తో మొద‌లుపెట్టి చాలా హిట్లే ఇచ్చారు. చివ‌ర‌గా విజ‌య్ హీరోగా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం తీయ‌గా.. అది మిక్స్డ్ టాక్ తోనూ 400 కోట్లకు పైగా వసూళ్లు తెచ్చుకొని సూపర్ హిట్ అయ్యింది. ఐతే ఆ సినిమా త‌ర్వాత వెంక‌ట్ ప్ర‌భు కొత్త సినిమాను మొద‌లుపెట్ట‌లేదు. చాలా వేగంగా పెద్ద హీరోగా ఎదుగుతున్న శివ కార్తికేయ‌న్‌తో వెంక‌ట్ త‌ర్వాతి సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. శివ.. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైంలో ఒక క్యామియో రోల్ కూడా చేశాడు.

ఐతే ఈ సినిమా స‌రిగా ఆడ‌క‌పోవ‌డం వ‌ల్లో, శివ‌కు వేరే కమిట్మెంట్లు ఉండ‌డం వ‌ల్లో.. వెంక‌ట్ ప్ర‌భుతో సినిమాను వెంట‌నే మొద‌లుపెట్ట‌లేక‌పోయాడు. ఈ ద‌ర్శ‌కుడేమో.. సినిమా చేయ‌కుండా ఖాళీగా ఉంటున్నాడు. ఈ నేప‌థ్యంలో వెంక‌ట్ ప్ర‌భు తండ్రి, ఇళ‌య‌రాజా త‌మ్ముడు.. స్వ‌యంగా సంగీత ద‌ర్శ‌కుడు అయిన గంగై అమ‌ర‌న్ లైన్లోకి వ‌చ్చారు.

ఒక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న శివకార్తికేయన్ పేరెత్త‌కుండా అత‌డి మీద ఫైర్ అయిపోయాడు. ఒక హీరో త‌న కొడుకును కావాల‌నే వెయిట్ చేయిస్తున్నాడ‌న్న‌ట్లుగా మాట్లాడాడు. అత‌ను ఎంత పెద్ద హీరో అయినా కానీ, వెంక‌ట్ త‌న కోసం ఎందుకు ఎదురు చూడాలి, దీని వ‌ల్ల మ‌న కుటుంబానికి అవ‌మానం క‌దా.. వేరే సినిమా చేసుకోవ‌చ్చు క‌దా అంటూ ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

దీంతో శివ‌కార్తికేయ‌న్ పేరు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవ‌డం మొద‌లైంది. ఇప్ప‌టికే కొన్ని కార‌ణాల వ‌ల్ల శివ మీద సోష‌ల్ మీడియాలో వ్య‌తిరేక‌త ఉంది. పెద్ద స్టార్ అయ్యాక అత‌డికి యాటిట్యూడ్ పెరిగింద‌ని, త‌న‌కు లైఫ్ ఇచ్చిన ధ‌నుష్‌ను కూడా అత‌ను లెక్క చేయ‌ట్లేద‌ని విమ‌ర్శిస్తుంటారు. ఇప్పుడు గంగై అమ‌ర‌న్ వ్యాఖ్య‌ల‌తో అత‌డి మీద ఎటాక్ ఇంకా ఎక్కువైంది. ఒక సీనియ‌ర్ ద‌ర్శ‌కుడిని అవ‌మానిస్తావా, వెయిట్ చేయిస్తావా అంటూ శివ మీద నెగెటివిటీ వైల్డ్ ఫైర్‌లా అంటుకోవ‌డంతో వెంక‌ట్ ప్ర‌భు స్పందించాల్సి వ‌చ్చింది.

శివ‌కార్తికేయ‌న్‌ను అపార్థం చేసుకోవ‌ద్ద‌ని, అత‌డితో త‌న‌కు మంచి స్నేహం ఉంద‌ని.. తామిద్ద‌రం క‌లిసి పని చేయాల‌నుకున్న‌ప్ప‌టికీ, వేరే కార‌ణాల‌తో ఇప్పుడు కుద‌ర‌డం లేద‌ని, త‌ర్వాత క‌చ్చితంగా సినిమా చేస్తామ‌ని వివ‌ర‌ణ ఇచ్చాడు వెంక‌ట్ ప్ర‌భు. ఈ పోస్టు మీద శివ కూడా స్పందించాడు. ఇంత చిన్న విష‌యానికి మీరెందుకు అంత సీరియ‌స్‌గా స్పందిస్తున్నారు.. మీకు ఎప్ప‌టికీ నేను ఫ్యాన్ బాయే .. వీలైన‌పుడు క‌లిసి ప‌ని చేద్దాం అని అత‌ను కామెంట్ చేశౄడు.

This post was last modified on September 29, 2026 8:55 am

Share

Recent Posts

మేన‌మామ ఉంగ‌రం విలువ 750 కోట్లు

రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న ఉచిత ప‌థ‌కాల‌కు త‌మిళ‌నాడు కేరాఫ్‌గా ఉంది. నాటి జ‌య‌ల‌లిత, క‌రుణానిధి ప్ర‌భుత్వాల నుంచి నేటి…

2 minutes ago

సీట్లన్నీ గెలిచినా ఈవీఎంలకు వ్యతిరేకమే

ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లపై చాలా సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది. ఈవీఎంలు ట్యాంపర్ చేయడం సాధ్యమేనని కొందరు ప్రోటోటైప్ ఈవీఎంలను ట్యాంపర్…

35 minutes ago

కీలక జిల్లాలు చేజారిపోతున్నాయి జగన్

రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడొకప్పుడు బెడిసికొట్టడం సహజం. కానీ, ఒక ఉమ్మడి జిల్లాలో పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగి పావులు…

1 hour ago

డైరెక్ట‌ర్ ఏడిస్తే… హీరోనే డైరెక్ట్ చేసుకున్నాడ‌ట‌

కొన్నిసార్లు ద‌ర్శ‌కులు క‌థ చెప్పినంత బాగా సినిమా తీయ‌లేక‌పోతుంటారు. అందుకు అనుభ‌వ లేమి కూడా కార‌ణం కావ‌చ్చు. లేదంటే రాత…

2 hours ago

ఖైరతాబాద్ లో కవిత? చీల్చడానికేనా?

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో కవిత…

2 hours ago

జైలుకే ఎక్కువ సార్లు వెళ్ళాను

నేను అసెంబ్లీకి వెళ్లిన దానికంటే జైలుకు వెళ్లిన రోజులే ఎక్కువగా ఉన్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట…

2 hours ago