Political News

తెలంగాణలో టీడీపీకి DNA ప్రాబ్లం

టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరి తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డిపై ఇప్పటికీ టీడీపీ ముద్ర వేసేందుకు చాలామంది తెలంగాణ నేతలు ప్రయత్నిస్తుంటారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకే కాంట్రాక్టర్లు ఇస్తున్నారని, ఆయన సీఎం చంద్రబాబుకు విధేయుడని చాలామంది రేవంత్ ను విమర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఢిల్లీలో ప్రతిదిన్ మీడియా నెట్వర్క్ నిర్వహించిన ‘ది కాంక్లేవ్ 2026’ లో పాల్గొన్న రేవంత్ అటువంటి వ్యాఖ్యలు, విమర్శలకు పరోక్షంగా సమాధానమిచ్చారు. తాను టీడీపీ, బీఆర్ఎస్ లకు వ్యతిరేకంగా పోరాడేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరానని రేవంత్ స్పష్టం చేశారు.

ఏబీవీపీ నేతగా మొదలైన తన ప్రస్థానం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం అయ్యే స్థాయికి చేరిందని రేవంత్ చెప్పారు. ఇన్నేళ్ల పొలిటికల్ కెరీర్ లో తాను ఎన్నో ఒడిదుడుకులు చూశానని అన్నారు. నార్త్ ఇండియాలో ఏబీవీపీ తరఫున కాలేజీలో ప్రెసిడెంట్ అయిన వారు ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తమ నియోజకవర్గంలో ఎన్నికైన ఘటనలు అనేకం ఉన్నాయని చెప్పారు. ఏబీవీపీలో ఉన్నవారంతా బీజేపీలో చేరాలని లేదని అన్నారు. తాను ఇండిపెండెంట్ గా జడ్పీటీసీగా గెలిచినపుడు తన జిల్లాలో కాంగ్రెస్ పార్టీని తాను ఓడించానని, కాబట్టి అప్పుడు కాంగ్రెస్ కు బలమైన ప్రత్యర్థి అయిన టీడీపీలో చేరానని చెప్పారు.

అయితే, 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీ ప్రాభవం తగ్గిందని, డీఎన్ఏ ప్రాబ్లం అని రేవంత్ చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత ఏపీకి చెందిన వారని, పార్టీ తెలంగాణలో ఉందని, కాబట్టి ప్రాంతీయవాదం అడ్డువచ్చిందని అన్నారు. నువ్వు సమర్థుడివైనప్పటికీ ఆంధ్రా వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడుతో కలిసి పని చేస్తున్నావు రేవంత్ అని తనతో చాలామంది అన్నారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ అస్థిత్వానికి ఇది విరుద్ధం అని భావించి టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరానని అన్నారు.

అయితే, 2017లో కేంద్రంతో పాటు ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందని. తెలంగాణలో బీఆర్ఎస్ ఉందని, ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా తాను పోరాడాలి కాబట్టి ఆ సమయంలో కాంగ్రెస్ లో చేరానని అన్నారు. రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్ తనను పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. చాలామంది కాంగ్రెస్ నేతలు తన చుట్టాలు అని చెప్పారు. ఆ తర్వాత కేసీఆర్ వర్సెస్ రేవంత్ అన్న వాతావరణం ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు.

This post was last modified on September 29, 2026 8:13 am

Share

Recent Posts

కీలక జిల్లాలు చేజారిపోతున్నాయి జగన్

రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడొకప్పుడు బెడిసికొట్టడం సహజం. కానీ, ఒక ఉమ్మడి జిల్లాలో పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగి పావులు…

26 minutes ago

ఖైరతాబాద్ లో కవిత? చీల్చడానికేనా?

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో కవిత…

1 hour ago

జైలుకే ఎక్కువ సార్లు వెళ్ళాను

నేను అసెంబ్లీకి వెళ్లిన దానికంటే జైలుకు వెళ్లిన రోజులే ఎక్కువగా ఉన్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట…

1 hour ago

సోమిరెడ్డి ఇలాకాలో నువ్వా – నేనా

నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైసీపీల మధ్య తీవ్ర రాజకీయ పోటీ నడుస్తోంది. ప్రస్తుత…

4 hours ago

జ్ఞానేశ్ ను నార్త్ కొరియా కిమ్ దెగ్గరకు పంపాలి

ఢిల్లీలో ప్రతిదిన్ మీడియా నెట్వర్క్ నిర్వహించిన ‘ది కాంక్లేవ్ 2026’ లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన…

6 hours ago

70 వయసులో అదిరిపోతున్న ‘చిరు’ ప్లానింగ్

ఇప్పటి స్టార్ హీరోల కెరీర్లు చూస్తున్నాం. జీవిత కాలంలో మహా అయితే ఇరవై నుంచి నలభై సినిమాలు చేస్తే గొప్పనేలా…

7 hours ago