Political News

సీట్లన్నీ గెలిచినా ఈవీఎంలకు వ్యతిరేకమే

ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లపై చాలా సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది. ఈవీఎంలు ట్యాంపర్ చేయడం సాధ్యమేనని కొందరు ప్రోటోటైప్ ఈవీఎంలను ట్యాంపర్ చేసి వీడియోలు కూడా విడుదల చేశారు. అయితే, సార్వత్రిక ఎన్నికలలో ఉపయోగించే ఈవీఎంలు ట్యాంపర్ కావని కేంద్ర ఎన్నికల సంఘం బల్లగుద్ది చెబుతోంది. అటువంటి సమయంలో ఆ ఈవీఎంలలో కొన్ని తమకు ఇస్తే ట్యాంపర్ చేసి చూపిస్తామని ఔత్సాహికులు సవాల్ విసురుతున్నారు. ఇలా ఈవీఎంల వ్యవహారంపై చాలాకాలంగా రచ్చ జరుగుతూనే ఉంది.

ఇక, 2024 ఎన్నికల్లో ఓటమి పాలైన వెంటనే ఈవీఎంల వల్లే ఓడిపోయామని వైసీపీ నేతలు పరోక్షంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తన కుటుంబ సభ్యల ఓట్లు కూడా తనకు పడలేదంటూ వైసీపీ నేత ఒకరు కోర్టును కూడా ఆశ్రయించారు. ఆ విషయం కోర్టులో ఇంకా పెండింగ్ లోనే ఉంది. అయితే, 2019లో కూడా వైసీపీ గెలిచినపుడు ఈవీఎంలను ఎందుకు నిందించలేదని కూటమి పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీతో పాటు భారత్ లోని కొన్ని రాజకీయ పార్టీలు అసలు ఈవీఎంలు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ తాము ఎన్నికలలో అన్ని సీట్లు గెలుచుకున్నప్పటికీ తాము ఈవీఎంలకు వ్యతిరేకమని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ఇదే విషయాన్ని తాను లోక్ సభలో కూడా చెప్పానని అఖిలేష్ అన్నారు.

అమెరికా,జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహిస్తున్న విషయాన్ని తాను పలుమార్లు చెప్పానని అన్నారు. సాంకేతికపరంగా, ఆర్థికంగా భారత్ కంటే బలమైన దేశం జర్మనీ అని, అటువంటి దేశంలోనే ఈవీఎంలు వద్దంటున్నారని. ఇక, ఈవీఎం ద్వారా ఓటు వేయడం రాజ్యాంగవిరుద్ధం అని ఆ దేశ సుప్రీం కోర్టు తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. కానీ, మన దేశంలో మాత్రం ఈవీఎంలపై ఈగ వాలనివ్వరని, పాత మెషీన్లు చెడిపోగానే కొత్త మెషీన్లు తెస్తున్నారని ఎద్దేవా చేశారు.

This post was last modified on September 29, 2026 8:32 am

Share

Recent Posts

కీలక జిల్లాలు చేజారిపోతున్నాయి జగన్

రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడొకప్పుడు బెడిసికొట్టడం సహజం. కానీ, ఒక ఉమ్మడి జిల్లాలో పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగి పావులు…

34 minutes ago

డైరెక్ట‌ర్ ఏడిస్తే… హీరోనే డైరెక్ట్ చేసుకున్నాడ‌ట‌

కొన్నిసార్లు ద‌ర్శ‌కులు క‌థ చెప్పినంత బాగా సినిమా తీయ‌లేక‌పోతుంటారు. అందుకు అనుభ‌వ లేమి కూడా కార‌ణం కావ‌చ్చు. లేదంటే రాత…

1 hour ago

ఖైరతాబాద్ లో కవిత? చీల్చడానికేనా?

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో కవిత…

1 hour ago

జైలుకే ఎక్కువ సార్లు వెళ్ళాను

నేను అసెంబ్లీకి వెళ్లిన దానికంటే జైలుకు వెళ్లిన రోజులే ఎక్కువగా ఉన్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట…

1 hour ago

సోమిరెడ్డి ఇలాకాలో నువ్వా – నేనా

నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైసీపీల మధ్య తీవ్ర రాజకీయ పోటీ నడుస్తోంది. ప్రస్తుత…

4 hours ago

జ్ఞానేశ్ ను నార్త్ కొరియా కిమ్ దెగ్గరకు పంపాలి

ఢిల్లీలో ప్రతిదిన్ మీడియా నెట్వర్క్ నిర్వహించిన ‘ది కాంక్లేవ్ 2026’ లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన…

6 hours ago