Movie News

డైరెక్ట‌ర్ ఏడిస్తే… హీరోనే డైరెక్ట్ చేసుకున్నాడ‌ట‌

కొన్నిసార్లు ద‌ర్శ‌కులు క‌థ చెప్పినంత బాగా సినిమా తీయ‌లేక‌పోతుంటారు. అందుకు అనుభ‌వ లేమి కూడా కార‌ణం కావ‌చ్చు. లేదంటే రాత మీద ఉన్నంత ప‌ట్టు తీత మీద లేక‌పోవ‌చ్చు. ఇలాంటి సంద‌ర్భాల్లో హీరోలే డైరెక్ష‌న్ చేయ‌డం.. లేదంటే తాము గైడెన్స్ ఇస్తూ ఇంకెవ‌రినైనా పెట్టి సినిమా తీయ‌డం లాంటివి జ‌రుగుతుంటాయి. త‌న కెరీర్లోనూ అలా ఒక సినిమాకు జ‌రిగింద‌ని అంటున్నాడు యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్.

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ త‌న‌యుడు జేస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ న‌టించిన సిగ్మా విడుద‌ల‌కు సిద్ధ‌మైన నేప‌థ్యంలో ఒక ఇంట‌ర్వ్యూలో అత‌ను మాట్లాడుతూ.. తాను న‌టించిన ఒక సినిమాకు వారం రోజుల పాటు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన విష‌యాన్ని వెల్ల‌డించాడు.

ఆ సినిమా ద‌ర్శ‌కుడు షూట్ మొద‌లైన కొన్ని రోజుల‌కు.. సెట్లో త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చి త‌న‌కు ద‌ర్శ‌క‌త్వం రాదంటూ ఏడ్చేశాడ‌ని సందీప్ చెప్పాడు. దీంతో చేసేది లేక ఒక వారం పాటు తానే సినిమాను డైరెక్ట్ చేశాన‌న్నాడు. ఆపై ఈ సినిమాకు చాలామంది ద‌ర్శ‌కులు మారారాని.. వారానికి ఒక‌రు వ‌చ్చి సినిమా పూర్తి చేశార‌ని తెలిపాడు. ఐతే ఆశ్చ‌ర్య‌కరంగా ఆ సినిమా బాగానే ఆడింద‌ని సందీప్ తెలిపాడు. మ‌రి సందీప్ కెరీర్లో ఇలా ఏ సినిమాకు జ‌రిగింది అంటూ నెటిజ‌న్లు చర్చించుకోవ‌డం మొద‌లుపెట్టారు.

ఈ సినిమాను డైరెక్ట్ చేసింది కొత్త ద‌ర్శ‌కుడు అంటున్నాడు కాబ‌ట్టి.. సందీప్ త‌నే ప్రొడ్యూస్ చేసుకున్న ఎ-1 ఎక్స్‌ప్రెస్ సినిమాకే ఇలా జ‌రిగి ఉండొచ్చ‌నే సందేహం క‌లుగుతోంది. అది ఒక త‌మిళ చిత్రానికి రీమేక్ కావ‌డం వ‌ల్లే ద‌ర్శ‌కులు మారినా ఇబ్బంది లేక‌పోయి ఉండొచ్చు. ఐతే ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర యావ‌రేజ్‌గానే ఆడింది. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడిగా డెన్నిస్ జీవ‌న్ కనుకొల‌ను అనే పేరు ప‌డింది. ఆ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. సందీప్ స‌ర‌స‌న ఫ‌రియా అబ్దుల్లా న‌టించిన సిగ్మా గాంధీ జ‌యంతి కానుక‌గా అక్టోబ‌రు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

This post was last modified on September 29, 2026 8:35 am

Share

Recent Posts

సీట్లన్నీ గెలిచినా ఈవీఎంలకు వ్యతిరేకమే

ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లపై చాలా సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది. ఈవీఎంలు ట్యాంపర్ చేయడం సాధ్యమేనని కొందరు ప్రోటోటైప్ ఈవీఎంలను ట్యాంపర్…

6 minutes ago

కీలక జిల్లాలు చేజారిపోతున్నాయి జగన్

రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడొకప్పుడు బెడిసికొట్టడం సహజం. కానీ, ఒక ఉమ్మడి జిల్లాలో పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగి పావులు…

34 minutes ago

ఖైరతాబాద్ లో కవిత? చీల్చడానికేనా?

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో కవిత…

1 hour ago

జైలుకే ఎక్కువ సార్లు వెళ్ళాను

నేను అసెంబ్లీకి వెళ్లిన దానికంటే జైలుకు వెళ్లిన రోజులే ఎక్కువగా ఉన్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట…

1 hour ago

సోమిరెడ్డి ఇలాకాలో నువ్వా – నేనా

నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైసీపీల మధ్య తీవ్ర రాజకీయ పోటీ నడుస్తోంది. ప్రస్తుత…

4 hours ago

జ్ఞానేశ్ ను నార్త్ కొరియా కిమ్ దెగ్గరకు పంపాలి

ఢిల్లీలో ప్రతిదిన్ మీడియా నెట్వర్క్ నిర్వహించిన ‘ది కాంక్లేవ్ 2026’ లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన…

6 hours ago