తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా, వీవీ శ్రీనివాసరావు, చారు సిన్హా, అనిల్ కుమార్, వీసీ సజ్జనార్ ఉన్నారు. ప్రస్తుతం వీరంతా ఏడీజీలుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. వీరిలో ఒక్క సజ్జనార్ మినహా.. ఎవరి విషయాన్నీ నెటిజన్లు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి.
హైదరాబాద్ కొత్వాల్‌గా ఉన్న సజ్జనార్‌పై మాత్రం ఆన్‌లైన్‌లో భారీ ఎత్తున డిబేట్ జరుగుతోంది. ప్రతి ఒక్కరూ ఆయనను అభినందిస్తున్నారు. కేవలం తెలంగాణ నెటిజన్లే కాకుండా.. దేశ విదేశాల్లోని తెలంగాణకు చెందిన వారు..ఆయన సొంత రాష్ట్రం కర్ణాటకకు చెందిన వారు కూడా సజ్జనార్‌పై విషెస్ వర్షం కురిపిస్తున్నారు. ఆయన మరిన్ని పదవులు అలంకరించాలని కోరుతున్నారు. ఇలా.. ఒక పోలీసు కమిషనర్‌కు పదోన్నతి కల్పించాక.. భారీ స్థాయిలో విషెస్‌రావడం ఇదే ఫస్ట్ టైమ్ అంటున్నారు.
ఎందుకు?
పోలీసు కమిషనర్ కాకముందు.. ఆయన ఎస్పీగా.. పనిచేశారు. ఆ తర్వాత ఆర్టీసీ ఎండీగా కూడా పనిచేశారు. ఆయా సమయాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేసిన అడుగులు సమాజంలో సజ్జనార్‌కు ప్రత్యేక గుర్తింపుతోపాటు.. ప్రజల్లో ప్రత్యేక అభిమానాన్ని కూడా పొందుపరిచాయి. ముఖ్యంగా మహిళలపై వేధింపులకు పాల్పడే వారిని కఠినంగా ఆయన అణిచివేశారు. ఇది మహిళా లోకాన్ని ఆయనవైపు చూసేలా చేసింది. ఆర్టీసీఎండీగా ఉన్నప్పుడు.. ఆ పదవికి వన్నెతెచ్చారు.
అసలు ప్రజలతో నేరుగా సంబంధం ఉండని ఆర్టీసీ ఎండీ పోస్టును ప్రజలకు చేరువ చేశారు. ఏ చిన్న సమస్య వచ్చినా స్పందించేవారు. ప్రజలకు సూచనలు చేసేవారు. ఇక, హైదరాబాద్ కమిషనర్‌గా డ్రగ్స్ సహా.. ఐబొమ్మ రవి వంటివారిపై ఉక్కుపాదం మోపి.. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వీటన్నింటికీమించి.. సాధారణ ప్రజలకు పోలీసు కమిషనర్ కార్యాలయాన్ని చేరువ చేశారు.
ఎవరైనా స్వేచ్ఛగా కార్యాలయంలోకి వచ్చి.. ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. మరీ ముఖ్యంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఆయన సోషల్ మీడియాను వదల్లేదు. సమయం.. సందర్భం ఏది ఉన్నా.. ఆయన వెంటనే సోషల్ మీడియాకు కనెక్ట్ అవుతారు. ఇవన్నీ.. ప్రజలకు -సజ్జనార్‌కు మధ్య బాండింగ్ పెంచాయి. ఇదే.. ఆన్‌లైన్‌లో చర్చగా మారింది. సాధారణంగా వచ్చే ప్రమోషనే అయినా.. ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates