అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం కంప్యూటింగ్‌లో తొలి అడుగు విజయవంతంగా పడిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ, గన్నవరంలోని ఓ కేంద్రంలో ఏర్పాటు చేసిన `క్వాంటం టెస్ట్‌బెడ్స్`ను మంగళవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. 1ఎస్, 1క్యూ క్వాంటం టెస్ట్‌బెడ్స్‌ను ప్రారంభించిన అనంతరం.. వాటిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి రాజధానిలో క్వాంటం వ్యాలీని పూర్తిస్థాయిలో ప్రారంభించనున్నట్టు తెలిపారు.
ఇంటికో పారిశ్రామికవేత్త..
ఇంటికో పారిశ్రామిక వేత్త నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. అదేవిధంగా విధానాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. అలాగే.. ఆవిష్కరణల రంగాన్ని అందరికీ చేరువ చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు తెలిపారు. తద్వారా.. సాంకేతికతను కొత్త పుంతలు తొక్కిస్తామ న్నారు. 45 లక్షల మందిని ఏఐ, క్వాంటం, వైజర్ డేటా సెక్యూరిటీలో నిపుణులుగా మారుస్తామని వివరించారు. కేవలం సాంకేతి కతను అనుసరించడమే కాకుండా.. సాంకేతిక రంగంలో ఏపీ ప్రత్యేక ఆవిష్కరణలకు కేంద్రంగా కూడా ఉంటుందన్నారు.
డిసెంబరు నుంచి రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ ప్రారంభమవుతుందని.. దీంతో ప్రపంచస్థాయికి రాజధాని ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త విధానం కింద.. ప్రతి వెయ్యి కుటుంబాల నుంచిఒక స్టార్టప్‌ను ప్రోత్సహించనున్నట్టు చెప్పారు. దీనికిగాను ప్రముఖ విద్యా సంస్థలైన ఐఐటీ చెన్నై, ఐబీఎం సంస్థల భాగస్వామ్యం తీసుకుంటా మన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లోనూ సాంకేతిక విప్లవం ఏఐ విప్లవం వంటివి మరింతగా పెరగనున్నాయని తెలిపారు. వాటిని అందిపుచ్చుకుని.. వైద్య, ఔషధాల ఆవిష్కరణ, వ్యవసాయ ఉత్పాదకత, రక్షణ పరిశోధన, లాజిస్టిక్స్ రంగాలను బలోపేతం చేయనున్నట్టు చెప్పారు.
This post was last modified on April 14, 2026 9:49 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…