Movie News

ఏ కాలంలో ఉన్నారు ధావన్ సాబ్

హీరో వరుణ్ ధావన్ కు అంతో ఇంతో చెప్పుకోదగ్గ ఇమేజ్ ఉంది. అందుకే దర్శకుడు అట్లీ  నిర్మాతగా మారి ఏరికోరి తేరి హిందీ రీమేక్ కోసం తనను తీసుకున్నాడు. అది డిజాస్టర్ కావడం వేరే విషయం. వరుణ్ కొత్త మూవీ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ వచ్చే నెల విడుదలకు రెడీ అవుతోంది. హీరోయిన్లు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్. ఇవాళ టీజర్ వదిలారు ఇద్దరు చిన్న పిల్లలు మాట్లాడుకుంటూ తమ తండ్రులు ఒక్కరే అనే ట్విస్టు విని షాక్ అవ్వడంతో ముగించారు.

విచిత్రం ఏమిటంటే పిల్లల క్లిప్పును ఏఐలో సృష్టించారు. చూడగానే దొరికిపోయేలా ఉంది. మ్యాటర్ అది కాదు. ఒక ప్రియుడు ఇద్దరు ప్రియురాలు లేదా ఒక భర్త ఇద్దరు భార్యలు కాన్సెప్ట్ తో ఇప్పటిదాకా లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. ఇటీవలే రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఇదే క్యాటగిరీలో వచ్చి యావరేజ్ అయ్యింది. ఇప్పుడీ బాలీవుడ్ మూవీకి దర్శకత్వం వహించిన డేవిడ్ ధావన్ మరీ పాతకాలంలోనే ఉండిపోయారా అంటూ మూవీ లవర్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

90 దశకంలో డేవిడ్ ధావన్ కు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరుండేది. ముఖ్యంగా గోవిందాతో ఆయన తీసిన కూలి నెంబర్ 1 లాంటి చిత్రాలు వసూళ్ల వర్షం కురిపించాయి. అఫ్కోర్స్ వాటిలో అత్యధిక శాతం రీమేకులే. నాగార్జున హలో బ్రదర్ ని సల్మాన్ ఖాన్ తో రీమేక్ చేసింది ఈయనే. అంతటి అనుభవమున్న డేవిడ్ ధావన్ తన కొడుకుతో ఇంత అవుట్ డేటెడ్ సబ్జెక్టు తీయడం ఏమిటనే కామెంట్స్ జోరుగా ఉన్నాయి. కథేంటో తెలియకుండానే ఈ రేంజ్ ట్రోలింగ్ నడుస్తోంది.

ఇంకో విషయం చెప్పుకోవాలి. డెకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ తాను ఆచితూచి సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చింది. అడివి శేష్ సైతం తన సెలక్షన్ మీద ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించాడు. తీరా చూస్తే మృణాల్ హిందీలో మాత్రం అత్తెసరు సినిమాలతో ఫ్లాపులు చవి చూస్తోంది. మూడేళ్ళుగా ఇదే తంతు నడుస్తోంది. మరి హై జవానీ తో ఇష్క్ హోనా హై అయినా తన గౌరవాన్ని నిలబెడుతుందేమో చూడాలి.

This post was last modified on April 14, 2026 9:27 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

4 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

5 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

5 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

6 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

6 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

6 hours ago