2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంటు స్థానాలను కూడా విభజించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి చర్చించేందుకు ఈ నెల 16 నుంచి 18 మధ్య రెండు రోజుల పాటు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు కూడా జరగనున్నాయి.
అయితే.. కేంద్రంలోని మోడీ సర్కారు ఈ దఫా పునర్విభజనలో కొత్త ప్రతిపాదన చేసింది. సంప్రదాయంగా ప్రతి పది సంవత్సరాలకు నియోజకవర్గాలను పునర్విభజిస్తున్నారు. దీనికి ఆయా రాష్ట్రాల్లో పెరుగుతున్న, తగ్గుతున్న జనాభాను పరిగణనలోకి తీసుకుంటున్నారు. తద్వారా.. జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో నియోజకవర్గాలు పెరుగుతున్నాయి. కానీ.. ఈ దఫా జనాభాతో సంబంధం లేకుండా.. ఏకీకృత ఫార్ములాను కేంద్రం తెరమీదికి తెచ్చింది.
దేశంలోని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలను సగం వరకు పెంచేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారాన్ని బీజేపీ పాలిత, ఎన్డీయే కూటమి పాలిత రాష్ట్రాలు స్వాగతిస్తున్నాయి. కానీ.. ఇతర పార్టీలు ఉన్న ప్రభుత్వాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఈ వ్యవహారంపై తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఫార్ములాను ప్రకటించారు. అసలు పూర్తి జనాభా లెక్కలు.. వద్దని.. రాష్ట్రాల ఆదాయాన్ని ప్రాతిపదికగా చేసుకుని సగం శాతం నియోజకవర్గాల పెంపు చేపట్టాలని ఆయన సూచించారు.
దీని ప్రకారం.. రాష్ట్రాల ఆర్థిక పనితీరును సూచించే స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) ఆధారంగా పార్లమెంటు సీట్లను పెంచడమో తగ్గించడమో చేయాలని అన్నారు. ఈ విధానం వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పడబోదని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన వేసిన అంచనాల ప్రకారాం.. ఏపీలోఎంపీ సీట్లు 38కి, తెలంగాణలో 30కి పెరుగుతాయన్నారు. ప్రస్తుతం ఏపీలో 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి ఫార్ములాను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.
This post was last modified on April 13, 2026 6:33 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…