విజయ్, త్రిషల గోల మళ్లీ మొదలు!

తమిళనాడు సీఎం విజయ్, సినీ నటి త్రిషల మధ్య రిలేషన్ షిప్ గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, విజయ్ తో విడాకుల పిటిషన్ ను ఆయన భార్య సంగీత విత్ డ్రా చేసుకోవడంతో విజయ్, త్రిషల మధ్య పుకార్లకు తెరపడిందని అంతా అనుకున్నారు. కానీ, తాజాగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ ఇద్దరి మధ్య సెల్యూట్ ల ఎక్స్ఛేంజ్ వ్యవహారం తాలూకు వీడియో వైరల్ గా మారింది.

చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గౌరవ వందనం స్వీకరిస్తున్నారు. ఈ వేడుకలకు విజయ్ తల్లిదండ్రులతోపాటు త్రిష కూడా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే అందరికీ అభివాదం చేస్తున్న విజయ్ ఆ తర్వాత సెల్యూట్ చేశారు. దానికి రెస్పాన్స్ అయిన త్రిష విజయ్ కు నిలబడి మరీ సెల్యూట్ చేశారు. విజయ్ కు త్రిష చేసిన సెల్యూట్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో, ముగిసి పోయిందనుకున్న విజయ్, త్రిషల గోల మళ్లీ మొదలైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక, ఈ కార్యక్రమానికి సీఎం విజయ్ భార్య హోదాలో సంగీత హాజరు కావాల్సి ఉందని, కానీ, ఆమె హాజరు కాలేదని కూడా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. విజయ్, సంగీతల మధ్య ఇంకా ప్యాచప్ కాలేదా అని కామెంట్స్ పెడుతున్నారు.