కొరియన్ కనకరాజు సీక్వెల్ కి ప్లానింగ్ జరుగుతోంది. కెన్యా కనకరాజు పేరుతో స్క్రిప్ట్ డిస్కషన్లు మొదలయ్యాయని సమాచారం. అంటే కొరియా దేశంలో పనైపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకో కంట్రీ నుంచి ఆత్మ వస్తుందన్న మాట. వినడానికి బాగానే ఉంది కానీ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈసారి పెద్ద కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కొరియన్ కనకరాజు సూపర్ హిట్టే కానీ మరీ పార్ట్ 2 కోసం ఆడియన్స్ ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూసేంత కాదు. అందుకే థియేటర్ రన్ నెమ్మదించింది.
అలాంటప్పుడు కొనసాగింపు కోసం తొందరపడటం అంత సేఫ్ గేమ్ కాదు. అయితే వరుణ్ తేజ్ అందరికీ సంతృప్తి కలిగేలా కథ రూపొందితేనే సెట్స్ పైకి వెళ్తామని అంటున్నాడు. నిజానికి ఒక సినిమా విజయవంతం కాగానే ఆ బ్రాండ్ ని క్యాష్ చేసుకునేందుకు తొందరపడకూడదు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ని సరిగ్గా వాడుకోలేక సర్దార్ గబ్బర్ సింగ్ ని ఏం చేశారో జనాలు మర్చిపోలేదు. కల్ట్ క్లాసిక్ మన్మథుడుకి 2 నెంబర్ తగిలిస్తే చాలా దారుణంగా ఫెయిలయ్యింది.
పుష్ప, కెజిఎఫ్, బాహుబలి లాగా ఆర్గానిక్ గా కంటిన్యుటీ ఉంటే సీక్వెల్స్ తీయాలి తప్పించి అవకాశం ఉంది కదాని కాదు. ఆ మాటకొస్తే మేర్లపాక గాంధీ తానే తీసిన వేంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజాలకు కూడా రెండో భాగాలు తీయొచ్చు. ప్రస్తుతం బరి మీద దృష్టి పెట్టబోతున్న వరుణ్ తేజ్ ఆ తర్వాతే మిగిలిన ప్రాజెక్టులు ఓకే చేయబోతున్నాడు. యదు వంశీ దర్శకత్వంలో రూపొందే ఈ స్పోర్ట్స్ కామెడీ డ్రామాని తొలుత సంక్రాంతి రిలీజ్ అనుకున్నారు కానీ సాధ్యమయ్యేలా లేదు.
ఫామ్ తగ్గిపోయిన మేర్లపాక గాంధీకి కొరియన్ కనకరాజు ఆక్సీజెన్ లా నిలబడింది. అయితే ఇందులో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. వాటిని నెక్స్ట్ తీయబోయే సినిమాలో ఓవర్ టేక్ చేయాలి. సత్య పాత్ర బాగా ఉపయోగపడబట్టి సరిపోయింది కానీ లేదంటే ఇంపాక్ట్ లెవెల్స్ తగ్గిపోయేవి. వరసగా సక్సెస్ మీట్లు చేస్తూ ప్రేక్షకుల అటెన్షన్ లో కొనసాగేందుకు కష్టపడుతున్న ఈ సినిమాకు డిసి, విశ్వనాథ్ అండ్ సన్స్, ఆవారాపన్ 2 రూపంలో బాక్సాఫీస్ దగ్గర టఫ్ కాంపిటీషన్ ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates