రాజా సింగ్… ఈ పేరు వింటేనే ఒక రకమైన భావన కలుగుతుంది. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని గోషా మహల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్న ఈ మాజీ బీజేపీ నేత ఏం చేసినా సంచలనంగానే మారుతుంది. తాను చేసిన పనుల వల్ల బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన సింగ్… నిత్యం వార్తల్లో ఉండేలా రకరకాల ఫీట్లు చేస్తుంటారు. తాజాగా శ్రీరామ నవమి నాడు ఏకంగా దీపావళి వేడుకలకు యత్నించిన ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
నవమి నాడు రాజా సింగ్ దీపావళి వేడుకలు, ఆ సందర్భంగా జరిగిన చిన్నపాటి ప్రమాదం తదితరాలకు చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోలో రాజా సింగ్ పూర్తిగా అలంకరించిన ఓ వాహన రధంపై ఎక్కి కూర్చున్నారు. రథంతో పాటు తాను నిండా అలంకరణలతోనే కనిపించారు. చేతిలో విల్లు, బాణాన్ని పట్టుకున్నారు. ఇక తన చేతిలోని విల్లంబులకు ఆయన టపాసులను అమర్చుకున్నారు.
ఇలా టపాసులను కట్టిన విల్లును ఎక్కు పెట్టిన రాజా సింగ్… విల్లు నుంచి బాణం విడుస్తున్నట్లుగా కనిపించారు. ఈ క్రమంలో విల్లులోని టపాసులు పేల్చిన కర్రను ఆయన సరిచేసే యత్నం చేశారు. ఈ సందర్భంలో విల్లుకు ఉన్న టాపాసులు ఒక్కసారిగా పేలాయి.
ఈ పేలుడు దూరం నుంచి వచ్చి పడ్డ టపాసులు పేలినట్లుగా కనిపించింది. ఉన్నపళంగా టపాసులు పేటడంతో ఆ పేలిన రవ్వలు సింగ్ ముఖం మీద పడ్డాయి. అయితే ఈ ప్రమాదంలో రాజా సింగ్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ వీడియోను చూసిన నెటిజన్లలో కొందరు రాజా సింగ్ ను ప్రోత్సహిస్తూ కామెంట్లు పెడితే… మెజారిటీ నెటిజన్లు ఇదే పోయే కాలమన్నట్లుగా ఆసక్తికర కామెంట్లు సంధిస్తున్నారు.
This post was last modified on March 29, 2026 7:30 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…