Movie News

బాక్సాఫీస్ ఆశలన్నీ వీరిద్దరిపైనే

రెండు నెల‌ల పాటు టాలీవుడ్ బాక్సాఫీస్‌లో స్లంప్ న‌డిచాక‌.. మార్చి మూడో వారంలో దురంధ‌ర్-2, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రాల రాక‌తో ఊపు వ‌చ్చింది. ఈ రెండు చిత్రాలు తొలి వారాంతంలో థియేట‌ర్లను క‌ళ‌క‌ళ‌లాడించాయి. కానీ హిందీ సినిమా కావ‌డం వ‌ల్ల ఎంత మంచి టాక్ ఉన్న‌ప్ప‌టికీ.. దురంధ‌ర్-2 రెండో వారంలో స్లో అయింది. ఇక ప‌వ‌న్ సినిమాకు బ్యాడ్ టాక్ రావ‌డం వ‌ల్ల ఫ‌స్ట్ వీకెండ్ త‌ర్వాత‌ ఆ సినిమా ఆశించిన స్థాయిలో వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేక‌పోతోంది.

ఈ రెండు చిత్రాలు చెప్పుకోద‌గ్గ వ‌సూళ్లు రాబ‌ట్ట‌డానికి ఈ ఆదివార‌మే చివ‌రి అవ‌కాశం అని చెప్పొచ్చు.
సోమ‌వారం నుంచి రెండు సినిమాల థియేట‌ర్లూ ఖాళీ అయిపోయే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. దురంధ‌ర్-2 హిందీ వెర్ష‌న్ పెద్ద సిటీల్లో మ‌ల్టీప్లెక్సుల వ‌ర‌కు ఇక ముందు కూడా ఆడొచ్చు కానీ.. మిగ‌తా చోట్ల క‌ష్ట‌మే. తెలుగు వెర్ష‌న్ ఆల్రెడీ స్లో అయింది.

ఇక ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ థియేట్రిక‌ల్ ర‌న్ రాదాపుగా ఆదివారంతో క్లోజ్ అయిన‌ట్లే. ఇక ఈ వీకెండ్లో వ‌చ్చిన బ్యాండ్ మేళం క‌నీస ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. డ‌బ్బింగ్ సినిమాల్లో యూత్ ప‌ర్వాలేదు. హ్యాపీ రాజ్ ప్ర‌భావం ఏమీ లేదు.
ఇక తెలుగు ప్రేక్ష‌కుల ఫోక‌స్ ఆటోమేటిగ్గా త‌ర్వాతి వారంలో వ‌చ్చే సినిమాల మీదికి మ‌ళ్ల‌బోతోంది.

వేస‌విలో బాగా ఆస‌క్తి రేకెత్తిస్తున్న రెండు సినిమాలు వచ్చే వారాంతంలో విడుద‌ల‌వుతున్నాయి. అవే.. బైక‌ర్, రాకాస‌. సంక్రాంతికి నారీ నారీ న‌డుమ మురారి చిత్రంతో చాన్నాళ్ల త‌ర్వాత ఓ మంచి హిట్ ఖాతాలో వేసుకున్న శ‌ర్వా.. ఈసారి బైక‌ర్ రూపంలో మ‌రింత ప్రామిసింగ్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. దీని టీజ‌ర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. తెలుగులో ఇలాంటి సినిమా అరుద‌నే చెప్పాలి. మ‌రో జెర్సీ అయ్యేలా క‌నిపిస్తోందీ చిత్రం. మంచి బ‌జ్ మ‌ధ్య ఈ చిత్రం విడుదల కానుంది.

మ‌రోవైపు మ్యాడ్ హీరో సంగీత్ శోభ‌న్ హీరోగా నిహారిక కొణిదెల నిర్మించిన రాకాస ప్రోమోలు కూడా భ‌లేగా అనిపిస్తున్నాయి. సంగీత్ కామెడీ టైమింగ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ సినిమా న‌వ్వించ‌డంతో పాటు థ్రిల్ చేసేలా క‌నిపిస్తోంది. ఈ రెండు చిత్రాలు మ‌ళ్లీ బాక్సాఫీస్‌కు ఊపు తీసుకొస్తాయని ట్రేడ్ పండితులు అంచ‌నా వేస్తున్నారు.

This post was last modified on March 29, 2026 6:11 pm

Share

Recent Posts

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

56 minutes ago

రిజర్వేషన్ లెక్కలు… ఎవరెవరికి ఎన్ని? ఎక్కడ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…

3 hours ago

ఈవీఎంల వల్లే జగన్ ఓడారు: తెలంగాణ మంత్రి

2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…

4 hours ago

లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…

6 hours ago

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

8 hours ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

9 hours ago