Movie News

‘చిరును అన్నవాళ్లంతా బాగుపడలేదు’

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన గద్దర్ పురస్కారాల వేడుకలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. సినీ రంగాన్ని ప్రోత్సహించడంలో పొరుగు రాష్ట్రం వెనుకబడి ఉందని.. ఏపీలో నంది అవార్డులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఐతే చిరు వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తే.. కొందరు విమర్శించారు.

సినీ రంగం హైదరాబాద్‌కు పరిమితం అయితే.. ఏపీ ఎందుకు అవార్డులు ఇవ్వాలన్న ప్రశ్నలు తలెత్తాయి. పొరుగు రాష్ట్రం, వెనుకబడింది లాంటి పదాలు కొందరికి ఆగ్రహం తెప్పించి చిరు మీద ఘాటైన విమర్శలు కూడా చేశారు. ఐతే చిరు అడిగిన దాంట్లో తప్పేముందంటూ అలాంటి వారి మీద అభిమానులు కౌంటర్ ఎటాక్ చేశారు. ఈ టాపిక్ మీద ఒక ఇంటర్వ్యూలో సీనియర్ దర్శకుడు వి.వి.వినాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు.

చిరు వ్యాఖ్యల్లో తప్పుబట్టడానికి ఏముందని ప్రశ్నించిన వినాయక్.. ఆయన్ని ఒక మాట అన్న వాళ్లు ఎవ్వరూ బాగుపడలేదంటూ తీవ్రంగా స్పందించారు.

“చిరంజీవి గారి గురించి అలా మాట్లాడినపుడు నాకు చాలా బాధేస్తుంది. కానీ ఏదన్నా మాట్లాడితే కాంట్రవర్శీ అవుతుందని ఊరుకుంటాం. ఎప్పుడైనా నేను మాట్లాడినా కూడా చిరంజీవి గారు తిడతారు. అసలు ఆయన మాట్లాడిన దాంట్లో రవ్వంత కూడా తప్పులేదు. ఏముంది అందులో? గతంలో నంది అవార్డులు ఎంత అంగ రంగ వైభవంగా జరిగేవి. ఉగాది రోజు పండుగంతా ఆ అవార్డుల్లోనే ఉందన్నట్లుండేది. మొత్తం అందరూ టీవీల ముందే ఉండేవారు.

ఉగాది రోజు సాయంత్రం టీవీల ముందు పెద్ద సెలబ్రేషన్ జరిగేది. ఆ అవార్డులు మళ్లీ ఇవ్వాలని కోరుకోవడంలో తప్పేముంది? అదేమైనా ఆయన కోసం అడిగారా? చిరంజీవి గారికి అవార్డులు ఎందుకు? అందరూ ఆనందపడతారనే ఆయన అలా అన్నారు. అది కూడా తప్పంటే ఎలా అండీ?

ఆయన్నెవరైతే కామెంట్ చేస్తారో వాళ్లంతా ఏదో ఒక రకంగా పాడైపోతారు. ఇందుకు వందల ఉదాహరణలు ఉన్నాయి. ఎవరికి వాళ్లే ఆలోచించుకోవాలి. ఒక మంచి వ్యక్తిని ఒక మాట అంటే అది కచ్చితంగా చెడు ప్రభావం చూపిస్తుంది. ఆయన్ని కామెంట్ చేసిన వాళ్లెవ్వరూ ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు. ఏదో ఒక రకంగా పాడయ్యారు. అసలు ఆయన స్థాయి ఏంటి.. ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర్నుంచి చిన్న కానిస్టేబుల్ వరకు అందరూ ఆయన అభిమానులే’’ అని వినాయక్ వ్యాఖ్యానించాడు.

This post was last modified on March 29, 2026 6:15 pm

Share

Recent Posts

‘స్లమ్ డాగ్’ సౌండ్ ఎప్పుడు వినపడుతుంది

దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…

12 minutes ago

జ‌గ‌న్‌కు ప‌ట్ట‌లేదు… లోకేష్ ప‌ట్టించుకున్నారు

వైసీపీ అధినేత జ‌గ‌న్ నివాసం ఉండే తాడేప‌ల్లి ప్రాంతం.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఉంటుంది. ఇక్క‌డ అనేక మంది పేద‌లు.. దిగువ…

46 minutes ago

మేన‌మామ ఉంగ‌రం విలువ 750 కోట్లు

రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న ఉచిత ప‌థ‌కాల‌కు త‌మిళ‌నాడు కేరాఫ్‌గా ఉంది. నాటి జ‌య‌ల‌లిత, క‌రుణానిధి ప్ర‌భుత్వాల నుంచి నేటి…

2 hours ago

దుమారం రేపిన ద‌ర్శ‌కుడి తండ్రి ఇంట‌ర్వ్యూ

త‌మిళంలో పేరున్న ద‌ర్శ‌కుల్లో వెంక‌ట్ ప్ర‌భు ఒక‌రు. చెన్నై-28తో మొద‌లుపెట్టి చాలా హిట్లే ఇచ్చారు. చివ‌ర‌గా విజ‌య్ హీరోగా గ్రేటెస్ట్…

3 hours ago

సీట్లన్నీ గెలిచినా ఈవీఎంలకు వ్యతిరేకమే

ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లపై చాలా సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది. ఈవీఎంలు ట్యాంపర్ చేయడం సాధ్యమేనని కొందరు ప్రోటోటైప్ ఈవీఎంలను ట్యాంపర్…

3 hours ago

కీలక జిల్లాలు చేజారిపోతున్నాయి జగన్

రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడొకప్పుడు బెడిసికొట్టడం సహజం. కానీ, ఒక ఉమ్మడి జిల్లాలో పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగి పావులు…

3 hours ago