Political News

మంత్రులకు తొలిసారి సీఎం విలువ తెలిసి వచ్చిందా?

మిగిలిన పార్టీలకు కాంగ్రెస్ పార్టీలకు ఒక స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. మిగిలిన పార్టీలో హీరోలు కొందరు.. సూపర్ హీరో పార్టీ అధినేత మాత్రమే అన్న విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. అధినేత అధిక్యతను గుర్తించేందుకు.. ఎలాంటి ఇబ్బందులకు గురి కారు. కానీ.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇందుకు భిన్నమైన సీన్ కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఈ సమస్య.. ఆ పార్టీలో ముందు నుంచి కనిపిస్తూనే ఉంటుంది. తిరుగులేని నాయకుడు తెర మీదకు వచ్చిన సందర్భంలో మాత్రం కొంతకాలం మౌనాన్ని ప్రదర్శిస్తారే కానీ.. ఏ చిన్న అవకాశం లభించినా.. తమకంటే తోపులు మరెవరూ లేరన్నట్లుగా కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తూ ఉంటుంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే.. అందుకు కారణం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన తప్పులు.. మితిమీరిన ఆత్మవిశ్వాసం.. దానికి ఏ మాత్రం తీసిపోని అహంకారం.. వెరసి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణాలుగా చెబుతారు. కానీ.. ఇక్కడే మరో అంశాన్ని కూడా ప్రస్తావించాలి. బీఆర్ఎస్ లోపాల్ని.. తమ విజయాలకు అవకాశాలుగా మార్చుకునే విషయంలో రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించిన వైనం తెలిసిందే. అయితే.. రేవంత్ అధిక్యతను అంగీకరించే విషయంలో కాంగ్రెస్ నేతలు ససేమిరా అనే పరిస్థితి.

మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరూ కూడా రేవంత్ గొప్పతనాన్ని కానీ.. అతడి నాయకత్వ లక్షణాల్ని.. ప్రత్యర్థులను నిలువరించే నేర్పరితనాన్ని.. నైపుణ్యాన్ని గుర్తించేందుకు కానీ అర్థం చేసుకోవటానికి ససేమిరా అనే పరిస్థితి. అంతెందుకు.. ఎన్నికల వేళ.. పది మంది ఎమ్మెల్యేల్ని గెలిపించుకునే విషయంలో ముందుకురాని నేతలు.. తీరా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత మాత్రం సీఎం కుర్చీలో కూర్చోవటానికి పడిన తాపత్రయం అంతా ఇంతకాదు.

ఏదిఏమైనా.. రేవంత్ లోని నాయకుడ్ని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం.. ఎవరెన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా.. రేవంత్ చేతికి అధికార దండాన్ని అప్పజెప్పేసింది. అప్పటినుంచి నిన్న మొన్నటి వరకు కూడా సీఎం రేవంత్ ను తమ అధినాయకుడిగా ఒప్పుకునేందుకు.. చాలామంది సీనియర్ నేతలకు ఇగో అడ్డుపడేది. తమకంటే వయసులోనూ.. అనుభవంలోనూ చిన్నోడైన రేవంత్ అధిక్యతను ఎందుకు అంగీకరించాలన్నట్లుగా వారి వైఖరి ఉండేది. ఇలాంటి వాటికి సమాధానాలు ఎవరు చెప్పినా.. చెప్పకున్నా కాలం సరిగా చెబుతుంది. రేవంత్ సమర్థతను., సామర్థ్యాన్ని ఒక్కొక్క సందర్భంలో ఒక్కో సీనియర్ నేత అర్థం చేసుకునే పరిస్థితి.

తాజాగా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా.. సీఎం రేవంత్ తాను మిగిలిన కాంగ్రెస్ తోపు సీనియర్ నేతల కన్నా తాను భిన్నమన్న విషయాన్ని తన వాదనా పటిమతో చెప్పకనే చెప్పేసేరు. నిజానికి శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాన్ని తీసుకుంటే.. మంత్రి పొంగులేటిపై హరీశ్ రావు విరుచుకుపడుతుంటే.. ఆయన్ను అడ్డుకునేందుకు మంత్రుల్లో ఎవరి దగ్గరా సరైన అస్త్రాలు లేని వేళలో.. రంగంలోకి దిగిన సీఎం రేవంత్ మొత్తం ఆటను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవటమే కాదు..

అప్పటివరకు స్పష్టమైన అధిక్యతను ప్రదర్శించిన హరీశ్ రావుకు.. మింగుడుపడని రీతిలో అత్యంత వేగంగా తనదైన వాదనను వినిపించటమే కాదు.. ఊహించని విధంగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించటం ద్వారా గులాబీ బ్యాచ్ కు దిమ్మ తిరిగే షాకిచ్చారని చెప్పొచ్చు. మొత్తంగా ఈ రోజు తర్వాత సీఎం రేవంత్ విలువ ఏమిటన్న విషయంతో పాటు.. తమకు రేవంత్ కు మధ్యనున్న వ్యత్యాసాన్ని పలువురు సీనియర్ మంత్రులకు బాగానే అర్థమై ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on March 29, 2026 10:07 am

Share

Recent Posts

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

4 hours ago

వైసీపీకి మ‌రో షాక్ త‌ప్ప‌దా.. !

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు చూసింది ఒక లెక్క‌.. ఇక నుంచి మ‌రో…

4 hours ago

డీజే దెబ్బకు ఆగిన గుండె.. అసలేంటీ డీజే?

ప్ర‌స్తుతం ఏపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన 'డీజే సౌండ్‌' వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. తాజాగా అనంత‌పురంలో నిర్వ‌హించిన వినాయ‌క నిమ‌జ్జ‌న…

6 hours ago

ప్యారడైజ్ టీం కాయదును హర్ట్ చేసిందా?

ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్‌గా…

6 hours ago

రెండు పొరపాట్లు ఇంత మూల్యాన్ని చెల్లించాయి

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…

7 hours ago

దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. ఎమ్మెల్యే పదవి రద్దు!

ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ అన‌ర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ విష‌యాన్ని అసెంబ్లీ స్పీక‌ర్ ప్ర‌సాద్…

8 hours ago