2027 ప్యాన్ ఇండియా సినిమాల విడుదల తేదీల రచ్చ చాలా అడ్వాన్స్ గా మొదలైపోయింది. వారణాసి ఏప్రిల్ 7 రాకపోవచ్చనే ప్రచారం బలంగా జరుగుతున్న సమయంతో ఖాళీ అవుతున్న ఆ స్లాట్ ని ఎవరు తీసుకుంటారనే దాని మీద అప్పుడే చర్చలు మొదలయ్యాయి. రాజమౌళి వైపు నుంచి ఇప్పటికైతే ఎలాంటి సమాచారం లేదు. పోస్ట్ పోన్ వార్తలను ఖండిస్తూ కార్తికేయ ట్వీట్లు చేయడం లాంటివి కనిపించలేదు. ఇప్పటికైతే ఆన్ ట్రాకనే నమ్ముతున్నారు మహేష్ బాబు అభిమానులు.
ఒకవేళ వారణాసి కనక తప్పుకునే పక్షంలో ఆ స్లాట్ ని డ్రాగన్ తీసుకోవచ్చనే కొత్త ప్రచారం ఊపందుకుంది. కానీ ప్రాక్టికల్ గా చూస్తే ఇది జరిగే పని కాదని చెప్పొచ్చు. ఎందుకంటే షూటింగ్ ఇంకా బాలన్స్ ఉంది. జూన్ రిలీజ్ ఆల్రడీ ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి దర్శకుడు ప్రశాంత్ నీల్ దానికి అనుగుణంగానే పనులు ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యంగా పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం అవసరమవుతుంది కనక హడావిడి పడటం లాంటివి చేయకుండా ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్తున్నారు.
ఇప్పుడు హఠాత్తుగా మూడు నెలలు అడ్వాన్స్ కావడమంటే ముళ్ళమీద నడవడమే అవుతుంది. పైగా ఇంటర్నేషనల్ గా గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సూపర్ నోవా రాక, ఐపీఎల్ మ్యాచులు, పరీక్షల సీజన్ లాంటివి పెట్టుకుని డ్రాగన్ అలాంటి నిర్ణయం తీసుకోదు. పైగా ఇంకా గుమ్మడికాయ కొట్టే సూచనలే దగ్గర లేనప్పుడు ఏప్రిల్ లో రావడం అంత ఈజీ కాదు. ఇవన్నీ బేరీజు వేసుకుని చూసుకుంటే డ్రాగన్ ముందు లాక్ చేసుకున్న జూన్ కి వస్తే అదే మహాభాగ్యమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
సరే డ్రాగన్ పాత మాటకే కట్టుబడినా వారణాసి సంగతి జక్కన్న స్వయంగా చెప్పేదాకా దేని గురించి నిర్ధారణకు రాలేం. అనిల్ రావిపూడి ప్రాజెక్టు అనౌన్స్ చేశాక జూనియర్ ఎన్టీఆర్ మరింత యాక్టివ్ గా డ్రాగన్ ని పూర్తి చేయించే పనిలో ఉన్నాడని వినికిడి. రెండు భాగాలు ఒకే ఏడాది రిలీజ్ చేయాలని తొలుత అనుకున్నప్పటికీ ఇప్పుడు పార్ట్ 2 ఆ తర్వాతి సంవత్సరం ఇస్తే ఎలా ఉంటుందనే డిస్కషన్ జరుగుతోందట. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న డ్రాగన్ కు రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు.
This post was last modified on November 19, 2026 11:02 am
సుదీర్ఘంగా నిర్మాణంలో ఉండి విడుదల కోసం నెలలు సంవత్సరాలు ఎదురు చూసిన టైసన్ నాయుడు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు…
న్యాచురల్ స్టార్ నాని తన వాల్ పోస్టర్ బ్యానర్ మీద సినిమాలను చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానంటూ జనసేన కార్యాలయం పేరుతో ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లకు ఆ పార్టీ అధినేత జగన్ వార్నింగ్…
చేతిలో పెట్టుబడి లేదు.. వ్యాపారంలో అనుభవం లేదు.. అయినా సొంతంగా ఏదైనా సాధించాలనే బలమైన కోరిక ఉంది. అందుకోసం చదువుకుంటూనే…
వేదిక ఎక్కి మైకు చేతపట్టుకుంటే చాలు అక్కలు, చెల్లెమ్మలంటూ నీతులు వల్లించే జగన్ సొంత తల్లీ, చెల్లి విషయంలో మాత్రం…