న్యాచురల్ స్టార్ నాని తన వాల్ పోస్టర్ బ్యానర్ మీద సినిమాలను చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. అడిగితే ఏ హీరో అయినా కాల్ షీట్లు ఇస్తాడు కానీ తన సంస్థ రెగ్యులర్ గా ఉండకూడదనే ఉద్దేశంతో ఆచితూచి వేస్తున్న అడుగుల వెనుక నాని అక్కయ్య దీప్తి ఘంట పాత్రను తక్కువ చేసి చూడలేం. అందుకే వరస డిజాస్టర్లలో ఉన్న నితిన్ తో అలియాస్ రుక్మిణిని మూడు నెలల్లో పూర్తి చేయడమే కాక దాని మీద బజ్ వచ్చేలా చేసుకోవడంలో నాని టీమ్ వేసిన ప్లానింగ్ మంచి ఫలితం ఇచ్చింది.
నెక్స్ట్ ఇప్పుడు దుల్కర్ సల్మాన్ రాబోతున్నాడు. నాని ప్రొడ్యూసర్ గా రూపొందబోయే మూవీకి కోర్ట్ ఫేమ్ రామ్ జగదీష్ దర్శకత్వం వహించనున్నాడు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది. కోర్ట్ అంత పెద్ద హిట్టయ్యాక రామ్ జగదీశ్ చాలా గ్యాప్ తీసుకుని ఈ ప్రాజెక్టు మీద వర్క్ చేశారు. కొంచెం లేట్ అయినా సరే బెస్ట్ స్క్రిప్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నెలల తరబడి దాని మీద వర్క్ చేయించారు. ఇప్పుడు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే ముహూర్తం వచ్చేసింది.
మలయాళం కన్నా ఎక్కువ తెలుగులో ఫోకస్ పెడుతున్న దుల్కర్ సల్మాన్ ట్రాక్ రికార్డు ఇక్కడ వంద శాతం కొనసాగుతోంది. మల్లువుడ్ లో ఏమో కానీ టాలీవుడ్ లో మటుకు మంచి కాంబోస్, స్టోరీస్ పట్టేస్తున్నాడు. మహానటి నుంచి ఆకాశంలో ఒక తార దాకా ప్రతి సినిమా ఒక అదృష్టమనే చెప్పాలి. తర్వాత వరసలో కూడా ఉన్న శ్రీశ్రీ మీద కూడా మంచి అంచనాలున్నాయి. ఇప్పుడు నాని ఓకే చేసిన సబ్జెక్టు అంటే ఖచ్చితంగా బలమైన కంటెంట్ ఉంటుందని చెప్పొచ్చు.
హీరోయిన్, క్యాస్టింగ్ ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అఫీషియల్ లాంచ్ గ్రాండ్ గా చేస్తారట. ఆకాశంలో ఒక తార థియేటర్ రన్ అయిపోయేలోపు ఈ లాంఛనం జరగొచ్చు. ప్యారడైజ్ దారుణంగా నిరాశ పరిచాక నాని ఫోకస్ మొత్తం బ్లడీ రోమియో మీద ఉంది. ఈసారి మాస్ తో పాటు క్లాస్ ని టార్గెట్ చేసుకుంటూ దర్శకుడు సుజిత్ సహాయంతో బ్లాక్ బస్టర్ అందుకుంటాడనే నమ్మకం ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. అయితే దీనికన్నా ముందు అలియాస్ రుక్మిణి సక్సెస్ కోసం నాని ఎదురు చూస్తున్నాడు.
This post was last modified on November 19, 2026 9:53 am
సుదీర్ఘంగా నిర్మాణంలో ఉండి విడుదల కోసం నెలలు సంవత్సరాలు ఎదురు చూసిన టైసన్ నాయుడు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు…
ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానంటూ జనసేన కార్యాలయం పేరుతో ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లకు ఆ పార్టీ అధినేత జగన్ వార్నింగ్…
చేతిలో పెట్టుబడి లేదు.. వ్యాపారంలో అనుభవం లేదు.. అయినా సొంతంగా ఏదైనా సాధించాలనే బలమైన కోరిక ఉంది. అందుకోసం చదువుకుంటూనే…
వేదిక ఎక్కి మైకు చేతపట్టుకుంటే చాలు అక్కలు, చెల్లెమ్మలంటూ నీతులు వల్లించే జగన్ సొంత తల్లీ, చెల్లి విషయంలో మాత్రం…
వీడియో గేమ్స్ అంటే యువతకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమకు నచ్చిన గేమ్ కోసం గంటల…