స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లకు ఆ పార్టీ అధినేత జగన్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ తమ నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం అయితే వారికి రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోనని జగన్ కరాఖండిగా తేల్చి చెప్పేశారు. అయితే, వైసీపీపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు కూటమికి పట్టం కట్టారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ నేతలకు జగన్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో సరిగా పనిచేయని నేతల చిట్టా తన దగ్గర ఉందని, వారి పనితీరుపై నివేదికలు తనకు అందాయని జగన్ అన్నారు.
ఈ ఎన్నికల్లో ఫలితాలతో పాటు రెండున్నరేళ్ల కాలంలో ఆ నేతల పనితీరును కూడా కలిపి వారిపై తాను ఒక అంచనాకు వస్తున్నానని చెప్పారు. ఈ ఎన్నికలను కొందరు నియోజకవర్గ ఇన్ చార్జ్ లు సరిగ్గా పట్టించుకోలేదని జగన్ తో సమన్వయకర్తల సమావేశం సందర్భంగా పెళ్లకూరు జడ్పీటీసీ సభ్యుడు సత్యనారాయణ రెడ్డి అన్నారట. అంతేకాదు, ఇన్ చార్జిల విషయం జగన్ కఠిన నిర్ణయం తీసుకోవాలని, ప్రక్షాళన చేయాలని కూడా ఆయన సూచించారట. అయితే, సమన్వయకర్తలు, నియోజకవర్గ ఇన్ చార్జిల ముందే ఆ సూచన చేయడాన్ని సజ్జల సరదాగా వారించారట.
దీనికి స్పందించిన జగన్…ఆల్రెడీ తాను ఒక లిస్ట్ తయారు చేస్తున్నానని, త్వరలోనే ఆ లిస్ట్ గురించి అందరితో మాట్లాడతానని చెప్పారట. నియోజకవర్గాల వారీగా అందరి జాతకాలు తన దగ్గరున్నాయని, త్వరలోనే విడివిడిగా వారితో మాట్లాడతానని జగన్ చెప్పారట. నియోజకవర్గాల ఇన్ చార్జీల వారీగా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆల్రెడీ జగన్ తెప్పించుకున్నారని, వారి పనితీరుపై సమీక్ష చేస్తున్నారని తెలుస్తోంది. కొన్ని చోట్ల టీడీపీ నేతలతో వైసీపీ ఇన్ చార్జిలు కుమ్మక్కైన వైనం, కొన్ని చోట్ల అభ్యర్థులకు మద్దతుగా నిలవకపోవడం వంటి విషయాలపై కూడా జగన్ ఫోకస్ పెట్టారట. ఏది ఏమైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత వైసీపీలో నియోజకవర్గస్థాయి నేతలలో కొందరిపై వేటు తప్పదని తెలుస్తోంది.
This post was last modified on November 19, 2026 8:56 am
2027 ప్యాన్ ఇండియా సినిమాల విడుదల తేదీల రచ్చ చాలా అడ్వాన్స్ గా మొదలైపోయింది. వారణాసి ఏప్రిల్ 7 రాకపోవచ్చనే…
సుదీర్ఘంగా నిర్మాణంలో ఉండి విడుదల కోసం నెలలు సంవత్సరాలు ఎదురు చూసిన టైసన్ నాయుడు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు…
న్యాచురల్ స్టార్ నాని తన వాల్ పోస్టర్ బ్యానర్ మీద సినిమాలను చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానంటూ జనసేన కార్యాలయం పేరుతో ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.…
చేతిలో పెట్టుబడి లేదు.. వ్యాపారంలో అనుభవం లేదు.. అయినా సొంతంగా ఏదైనా సాధించాలనే బలమైన కోరిక ఉంది. అందుకోసం చదువుకుంటూనే…
వేదిక ఎక్కి మైకు చేతపట్టుకుంటే చాలు అక్కలు, చెల్లెమ్మలంటూ నీతులు వల్లించే జగన్ సొంత తల్లీ, చెల్లి విషయంలో మాత్రం…