Political News

7 కోట్ల మోసంపై మౌనం వీడిన పవన్ పీఏ రుక్మిణి

ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానంటూ జనసేన కార్యాలయం పేరుతో ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ స్కాంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పీఏ కోట రుక్మిణికి సంబంధం ఉందంటూ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు ప్రచారం చేస్తున్నాయి. ఈ ఆరోపణల విషయంలో ఇన్నాళ్లు నోరువిప్పని కోట రుక్మిణి ఇప్పుడు స్పందించారు. నా సంస్థలోని ఒక ఉద్యోగి ఆర్థిక లాభం కోసం నా పేరును, నా సంస్థ గుర్తింపును, అధికారిక పత్రాలను దుర్వినియోగం చేస్తూ ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడినట్లు నా దృష్టికి వచ్చిందని, వెంటనే సదరు ఉద్యోగిని తొలిగించి వేయడమే కాకుండా తన సంస్థ తరుపున పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. తప్పుచేసిన వాళ్లను వదిలిపెట్టి, తనను టార్గెట్ చేయడమేంటని ప్రశ్నించారు. 

వాస్తవాలను వక్రీకరించి, నా వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్టను దెబ్బతీయడానికి తెరవెనక కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఇందులోకి లాగే ప్రయత్నాలను చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తన మౌనాన్ని బలహీనతగా, తన సహనాన్ని భయంగా భావించవద్దని హితవు పలికారు. ఏదైనా చట్టపరంగా పోరాడతానని కోట రుక్మిణి స్పష్టం చేశారు.

ఇంతకూ ఏమి జరిగిందంటే…

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో 7 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన కేసులో బోడపాటి ధరణి కృష్ణ ప్రధాన నిందితురాలు. ఆమె గతంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యురాలిగా ఉన్నారు. జనసేన నాయకురాలు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేసిన కోట రుక్మిణి డైరెక్టర్‌గా ఉన్న ‘కైరెన్ టెక్నాలజీస్’ సంస్థలో ధరణి కృష్ణ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు.

కోట రుక్మిణి పేరును ఉపయోగించుకొని ఏలూరు, తణుకు ప్రాంతాలకు చెందిన సుమారు 36 మందికి పోలీసు, దేవాదాయ తదితర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 7 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితులకు నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు, ఐడీ కార్డులు ఇచ్చి మోసం చేసినట్లు తెలిసి ఆమె మీద మంగళగిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడీ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. 

ధరణి కృష్ణ ఏమి చెబుతుందంటే…

పోలీసు విచారణ తర్వాత ధరణి కృష్ణ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తాను కేవలం సాధారణ ఉద్యోగిని మాత్రమేనని, కోట రుక్మిణి,  కళ్యాణం శివ శ్రీనివాసరావు (కేకే) కలిసి అసలు సూత్రధారులను తప్పించి తనను బలిపశువును చేస్తున్నారని ఆరోపించారు. పోలీసు కస్టడీలో తనను తీవ్రంగా కొట్టారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపించడం వివాదంగా మారింది. అంతేకాకుండా ధరణి కృష్ణ తల్లి కూడా కోట రుక్మిణి మీద ఆరోపణలు చేయడం గమనార్హం. తన కుమార్తెను అక్రమంగా నిర్బంధించి వేధించారని ఆరోపిస్తూ ధరణి కృష్ణ తల్లి గార్ల నాగమణి ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో కీలక మలుపు తిరిగింది. మొత్తం మీద ఈ కేసు ఏమౌతుందో అన్న ఆసక్తి  రేకేత్తించింది.

This post was last modified on November 19, 2026 9:08 am

Share

Recent Posts

డ్రాగన్ మనసు మారే అవకాశం ఉందా

2027 ప్యాన్ ఇండియా సినిమాల విడుదల తేదీల రచ్చ చాలా అడ్వాన్స్ గా మొదలైపోయింది. వారణాసి ఏప్రిల్ 7 రాకపోవచ్చనే…

29 minutes ago

లేట్ చేసిన నాయుడులో మ్యాటర్ ఉంది

సుదీర్ఘంగా నిర్మాణంలో ఉండి విడుదల కోసం నెలలు సంవత్సరాలు ఎదురు చూసిన టైసన్ నాయుడు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు…

1 hour ago

దుల్కర్ హీరోగా ప్రొడ్యూసర్ నాని సినిమా

న్యాచురల్ స్టార్ నాని తన వాల్ పోస్టర్ బ్యానర్ మీద సినిమాలను చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

2 hours ago

ఆ వైసీపీ నేతల లెక్క తేలుస్తానన్న జగన్!

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లకు ఆ పార్టీ అధినేత జగన్ వార్నింగ్…

9 hours ago

వాహ్ ఇది కదా విజయం అంటే.. ఒకప్పుడు ఫుడ్ డెలివరీ, ఇప్పుడు సొంత AI కంపెనీ!

చేతిలో పెట్టుబడి లేదు.. వ్యాపారంలో అనుభవం లేదు.. అయినా సొంతంగా ఏదైనా సాధించాలనే బలమైన కోరిక ఉంది. అందుకోసం చదువుకుంటూనే…

10 hours ago

‘తల్లిని చెల్లిని అగౌరవపరచడం జగన్ కే చెల్లు’

వేదిక ఎక్కి మైకు చేతపట్టుకుంటే చాలు అక్కలు, చెల్లెమ్మలంటూ నీతులు వల్లించే జగన్ సొంత తల్లీ, చెల్లి విషయంలో మాత్రం…

13 hours ago