చేతిలో పెట్టుబడి లేదు.. వ్యాపారంలో అనుభవం లేదు.. అయినా సొంతంగా ఏదైనా సాధించాలనే బలమైన కోరిక ఉంది. అందుకోసం చదువుకుంటూనే ఫుడ్ డెలివరీ ఉద్యోగం చేసిన ఓ యువకుడు ఇప్పుడు ఏఐ రంగంలో సొంత సంస్థను స్థాపించే స్థాయికి ఎదిగాడు. ఒకప్పుడు ఆర్డర్లు అందిస్తూ జీవితం నేర్చుకున్న అతను.. ఇప్పుడు సాంకేతిక రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అతనే గోపీనాథ్ పాండియన్. ఆయన ప్రయాణం యువతకు ఎన్నో విషయాలను నేర్పిస్తోంది.
గోపీనాథ్‌కు చిన్న వయసు నుంచే వ్యాపారంపై ఆసక్తి ఉండేది. కేవలం ఉద్యోగం చేయడం కంటే సొంతంగా ఒక సంస్థను నిర్మించాలనేది ఆయన లక్ష్యం. 18 ఏళ్ల వయసులో క్రిప్టోకరెన్సీ మైనింగ్ రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇందుకు అవసరమైన పెట్టుబడిని సమకూర్చుకోవడం సవాలుగా మారింది. తండ్రి నుంచి ఆర్థిక సహాయం అందకపోవడంతో తన ప్రయత్నాలకు అవసరమైన డబ్బును తానే సంపాదించుకోవాలని భావించాడు.
అలా 2021 జనవరిలో చెన్నైలో స్విగ్గీ డెలివరీ భాగస్వామిగా పనిచేయడం ప్రారంభించాడు. దాదాపు ఏడాది పాటు చదువుతోపాటు ఈ ఉద్యోగాన్ని కొనసాగించాడు. రోజంతా డెలివరీలు చేస్తూ వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని భవిష్యత్తు వ్యాపారం కోసం దాచుకున్నాడు. ఈ సమయంలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. కేవలం రూ.15 విలువైన ఆర్డర్ అందించడానికి వెళ్లిన సందర్భం నుంచి, లిఫ్ట్‌లో సాంకేతిక సమస్య కారణంగా మూడు గంటలపాటు చిక్కుకుపోయిన అనుభవం వరకు ఎన్నో సంఘటనలు ఆయనకు ఎదురయ్యాయి.
డెలివరీ ఉద్యోగం చేస్తూనే సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవడంపై కూడా దృష్టి పెట్టాడు. 2022లో జావా ప్రోగ్రామర్‌గా ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత బైజూస్‌లో వ్యాపార అభివృద్ధి విభాగంలో పనిచేశాడు. అనంతరం డేటా సైన్స్ రంగంలోనూ అనుభవం సంపాదించాడు. ఇదే సమయంలో ప్రారంభించిన క్రిప్టోకరెన్సీ వ్యాపారం మాత్రం మార్కెట్ పతనంతో ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో ఆ ప్రయత్నాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.
అయితే ఒక వ్యాపారం విఫలమైందని తన లక్ష్యాన్ని వదులుకోలేదు. 2023 ఏప్రిల్‌లో యాక్సెంచర్‌లో ఏఐ డేటా ఇంజినీర్‌గా చేరి రెండేళ్లకు పైగా పనిచేశాడు. మరోవైపు వ్యాపార నిర్వహణపై అవగాహన పెంచుకునేందుకు అంతర్జాతీయ స్టార్టప్ శిక్షణ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. 2024 ఆగస్టులో గాడ్‌వర్స్ ఏఐ పేరుతో సొంత సంస్థను ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ సంస్థకు వ్యవస్థాపకుడిగా, ఛైర్మన్‌గా కొనసాగుతున్నాడు.
2026లో దుబాయ్‌లోని ఓ సంస్థలో ఐటీ, మార్కెటింగ్ విభాగాలకు సంబంధించిన బాధ్యతలు కూడా నిర్వహించాడు. అంతేకాదు, పాలన, ఆర్థిక వ్యవస్థ, సమిష్టి మేధస్సును అనుసంధానించే మరో దీర్ఘకాలిక ప్రాజెక్టుపై పనిచేస్తున్నాడు. దీనికి 10 నుంచి 15 ఏళ్ల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నాడు. ఒకప్పుడు తన కలల కోసం డెలివరీ ఉద్యోగం చేసిన యువకుడు.. నేడు సాంకేతిక రంగంలో సొంత సంస్థను నిర్మించడం వెనుక ఓటమిని లెక్కచేయకుండా నిరంతర అతను చేసిన ప్రయత్నం ఉంది. వైఫల్యాలను ముగింపుగా కాకుండా కొత్త పాఠాలుగా తీసుకుంటే జీవితంలో మరో అవకాశం తప్పకుండా లభిస్తుందని గోపీనాథ్ ప్రయాణం చెబుతోంది.
This post was last modified on November 18, 2026 9:59 pm
వేదిక ఎక్కి మైకు చేతపట్టుకుంటే చాలు అక్కలు, చెల్లెమ్మలంటూ నీతులు వల్లించే జగన్ సొంత తల్లీ, చెల్లి విషయంలో మాత్రం…
వీడియో గేమ్స్ అంటే యువతకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమకు నచ్చిన గేమ్ కోసం గంటల…
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద మరో ఛార్జిషీట్ దాఖలైంది. జగన్ అక్రమాస్తుల కేసును…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన పౌరాణిక చిత్రం 'రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' ఇప్పుడు థియేటర్లలో…
టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్…
కొన్ని కొన్ని ప్రకటనలు విని ఊరుకోవాల్సిందే!. కానీ, నాయకులు మాత్రం ఊదరగొడుతూనే ఉంటారు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత శబరిమల ఆలయాన్ని…