సుదీర్ఘంగా నిర్మాణంలో ఉండి విడుదల కోసం నెలలు సంవత్సరాలు ఎదురు చూసిన టైసన్ నాయుడు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అప్పట్లో ఒకడుండేవాడు తర్వాత పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చేసిన దర్శకుడు సాగర్ చంద్ర దీనికి కెప్టెన్ కావడంతో మూవీ లవర్స్ లో నమ్మకమైతే ఉంది. కొద్దిరోజుల క్రితం లిరికల్ సాంగ్ రిలీజ్ చేశాక తాజాగా టీజర్ ని తీసుకొచ్చారు. కథకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన క్లూస్ ఇచ్చి కంటెంట్ పట్ల అవగాహన కలిగించారు.
సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ నాయుడు (బెల్లంకొండ సాయిశ్రీనివాస్) ఆధ్వర్వంలో తీవ్రవాదులను పట్టుకునేందుకు ఒక స్పెషల్ టీమ్ ఫార్మ్ చేస్తుంది గవర్నమెంట్. శత్రు మూకలను వేటాడుతూ వెళ్లిన నాయుడుకి చాలా అడ్డంకులు ఎదురవుతాయి. పై అధికారి (రావు రమేష్) తో పాటు ఎదురుగా కనిపించినా ఏమి చేయలేకపోతున్న ఎనిమి (శత్రు) రూపంలో సవాళ్ళను ఎదురుకుంటాడు. కెరీర్ లోనే అత్యంత క్లిష్టమైన మిషన్ ని తలకెత్తుకున్న టైసన్ నాయుడు ఈ యుద్ధంలో ఎలా గెలిచాడనేది స్టోరీ.
బాగా జాప్యం జరిగిన సంగతి పక్కనపెడితే టైసన్ నాయుడులో మ్యాటర్ ఉన్నట్టు కనిపిస్తోంది. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ కొత్త కాకపోయినా ట్రీట్ మెంట్ పరంగా మైండ్ గేమ్ ని దర్శకుడు సాగర్ చంద్ర డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టు అనిపిస్తోంది. భీమ్స్ సిసిరోలియో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు అనిత్ మాదాడి ఛాయాగ్రహణంలో మంచి స్టాండర్డ్ కనిపిస్తోంది. అయితే స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే ఇలాంటి సినిమాల్లో అది ఎంగేజింగ్ గా ఉంటేనే ఆడియన్స్ మెప్పు పొందడం సాధ్యమవుతుంది.
అంతా బాగానే ఉంది కానీ టైసన్ నాయుడు విడుదల తేదీ టీజర్ లో ప్రకటించలేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరో సినిమా హైందవ ఈ నెల 27 విడుదల కానుంది. డిసెంబర్ లో వరసగా పెద్ద సినిమాలు క్యూ కట్టి ఉన్నాయి. మరి టైసన్ నాయుడు ఏ స్లాట్ తీసుకుంటాడో చూడాలి. జనవరిలో సంక్రాంతి హడావిడి వల్ల ఆ స్లాట్ సాధ్యం కాకపోయినా. ఏ నిర్ణయం తీసుకున్నా వరసగా తక్కువ గ్యాప్ లో రెండు బెల్లంకొండ సినిమాలు రావడమైతే పక్కాని అర్థమైపోయింది కాబట్టి ఫ్యాన్సికిది గిఫ్టే.
This post was last modified on November 19, 2026 10:13 am
న్యాచురల్ స్టార్ నాని తన వాల్ పోస్టర్ బ్యానర్ మీద సినిమాలను చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానంటూ జనసేన కార్యాలయం పేరుతో ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లకు ఆ పార్టీ అధినేత జగన్ వార్నింగ్…
చేతిలో పెట్టుబడి లేదు.. వ్యాపారంలో అనుభవం లేదు.. అయినా సొంతంగా ఏదైనా సాధించాలనే బలమైన కోరిక ఉంది. అందుకోసం చదువుకుంటూనే…
వేదిక ఎక్కి మైకు చేతపట్టుకుంటే చాలు అక్కలు, చెల్లెమ్మలంటూ నీతులు వల్లించే జగన్ సొంత తల్లీ, చెల్లి విషయంలో మాత్రం…
వీడియో గేమ్స్ అంటే యువతకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమకు నచ్చిన గేమ్ కోసం గంటల…