ఊహకు అందని పరిణామాలు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. అందుకు నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పొచ్చు. ఒక ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోవటం.. దానికి పరిహారంగా వచ్చే డబ్బుల విషయంలో రైతులు సంత్రప్తిగా ఉండటం కనిపించదు. అందుకు భిన్నంగా ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న భూములకు పరిహారంగా ఇస్తున్న మొత్తం భారీగా ఉండటమే కాదు.. వారి పరిస్థితులు ఇప్పుడు అంచనాలకు అందని రీతిలో ఉంటాయన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ పబ్లిష్ చేసిన కథనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే.. భూపరిహారం కింద ఒక రైతుకు అందుతున్న మొత్తం అక్షరాల రూ.15 కోట్లు వస్తున్నట్లుగా చెబుతున్నారు.
కట్ చేస్తే.. ఇంత భారీగా పరిహారం అందుతున్న రైతు ఆ మొత్తాన్ని ఏం చేద్దామనుకుంటున్నాడు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. దిమ్మ తిరిగే షాకింగ్ మాట సదరు రైతు నుంచి వస్తుందని చెబుతన్నారు. ఇంతకూ ఆ రైతు కొనాలని ప్లాన్ చేస్తున్న వస్తువ మరేమిటో కాదు.. ఏకంగా ఒక హెలికాఫ్టర్. అవును.. తనకు వచ్చే భారీ మొత్తంతో ఒక హెలికప్టర్ ను కొనుగోలు చేయటమే కాదు.. తన మిత్రులతో కలిసి ఫారిన్ ట్రిప్ కు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇంతకూ ఏ ప్రాజెక్టులో భాగంగా ఇంత భారీగా భూపరిహారం లభిస్తోంది? అదెక్కడ ఉంది? లాంటి అంశాల్లోకి వెళితే..
జేవార్ లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ మొదటి దశను తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభింరారు. ఉత్తరప్రదేవ్ కు ఒక మైలురాయిగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఎయిర్ పోర్టు కోసం సేకరిస్తున్న భూములకు భారీగా పరిహారం అందినట్లుగా చెబుతున్నారు. దీంతో.. రాత్రికి రాత్రి యూపీ రైతులు పలువురు కోటీశ్వరులుగా మారటమే కాదు.. వారు కలలో కూడా ఊహించనంత భారీ మొత్తాలు వారికి పరిహారం రూపంలో లభించినట్లుగా చెబుతున్నారు. ఈ ఎయిర్ పోర్టు ప్రాజెక్టుతో అక్కడి గ్రామీణ ముఖచిత్రం పూర్తిగా మారుతుందని చెబుతున్నారు.
అనేక కుటుంబాల ఆర్థికస్థితిగతులు పూర్తిగా మారిపోవటం ఖాయమంటున్నారు. ఎయిర్ పోర్టు నిర్మాణం నేపథ్యంలో పెద్ద ఎత్తున శ్రామికశక్తి అవసరం కావటంతో.. కొత్త ఉపాధి అవకాశాల జోరు భారీగా ఉంది. దీంతో అందుతున్న ఆదాయం విలాసవంతమైన వాటి కోసం ఖర్చు చేయాలన్న ఆలోచనను కొందరు చెప్పటం గమనార్హం. అయితే.. భూ పరిహారం పేరుతో దక్కే డబ్బులను వీలైనంత వరకు పెట్టుబడులుగా పెట్టాలే తప్పించి.. విలాసవంతమైన ఖర్చులకు పెడితే.. తర్వాతి కాలంలో చింతించాల్సి వస్తుందన్న మాట బలంగా వినిపిస్తోంది.
This post was last modified on March 29, 2026 8:24 am
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…
వస్తు, సేవల పన్ను.. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు.. జీఎస్టీ…
భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఆయన కు వినతి…