ఏపీలోని కూటమి ప్రభుత్వంలో వైసీపీ కోవర్టులు ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అయితే.. రాజకీయంగా కాదు.. అధికారికంగా.. పలువురు ఉన్నతాధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా మరోసారి వీరి వ్యవహారం చర్చకు రావడం.. ఈ విషయం మీడియాలో పెద్ద ఎత్తున రావడంతో సీఎం చంద్రబాబు అలెర్టయ్యారు. సదరు అధికారులపై ఆరా తీశారు. ఏం జరిగింది? అనే విషయాలను చంద్రబాబు తెలుసుకుంటున్నారు.
అసలు విషయం ఇదీ..
వైసీపీ హయాంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో పథకాన్ని తీసుకు వచ్చారు. దీనిని మూడు ఫేజ్‌లలో అమలు చేశారు. డబ్బులు లేక, ఇళ్లు కట్టుకోలేని వారికి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో అధికారులు.. అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు కుమ్మక్కయి.. అవసరానికి మించి ఇనుము, సిమెంటు, ఇతర నిర్మాణ సామగ్రిని వేల కోట్ల రూపాయల మేరకు కొనుగోలు చేశారు. వారు ఈ వస్తువులు కొనుగోలు చేసే నాటికి ఇంటి స్థలాల కేటాయింపే జరగలేదు.
అయినా కూడా.. కమీషన్లు, ముడుపుల కోసం.. సదరు కంపెనీలకు భారీ మొత్తంలో ఆర్డర్లు ఇచ్చారు. దీంతో ఆయా సరుకు మొత్తం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కు జిల్లాల్లో ఉన్న గోడౌనులకు చేరిపోయింది. కానీ, ఎంతకీ.. పనులు చేపట్టకపోవడంతో ఇనుము తుప్పుపట్టింది. వేల బస్తాల సిమెంటు రాళ్లుగా మారిపోయింది. దీనిపై కూటమి ఎమ్మెల్యేల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం విజిలెన్స్‌ను నియమించి.. విచారణ చేయించింది. ఈ క్రమంలో జరిగిన తతంగాన్ని విజిలెన్సు నివేదిక రూపంలో ఇచ్చింది.
ఈ క్రమంలో సదరు అక్రమాలపై చర్యలు తీసుకోవాలని సూచిస్తూ.. సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అయితే.. చర్యలు అంటే వారికి ఎలా అర్థమైందో తెలియదు కానీ.. అసలు కేసును నీరుగార్చేలా.. సదరు తుప్పుపట్టిన ఇనుమును, గడ్డలుగా మారిన సిమెంటును ఖాళీ చేసేయాలని.. గోడౌనులను శుభ్రం చేసి తాళాలు వేయాలని ఆదేశించారు. ఈ పరిణామం.. సర్కారుకు శరాఘాతంగా మారింది.
అప్పట్లో వైసీపీ నాయకులతో కుమ్మక్కయిన అధికారులు ఇలా ఆదేశించారంటూ.. వార్తలు రావడంతో ఇప్పుడు.. చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. సదరు అధికారుల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. వాస్తవానికి చర్యలు తీసుకోమంటే.. అప్పట్లో తప్పులు చేసిన వారిని పట్టుకోవాలని చంద్రబాబు చెప్పారు. కానీ, దీనిని వదిలేసి.. నాటి తప్పులు మూసేసే ప్రయత్నం చేయడం గమనార్హం.
This post was last modified on March 3, 2026 2:59 pm
బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…
తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…
ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…
థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…