ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది. మరో వారం రోజుల్లో నామినేషన్లకు కూడా గడువు ముగియనుంది. ఈ క్రమంలో రెండు విధానాల ద్వారా.. బీఆర్ఎస్ పార్టీ.. అధికార పార్టీ కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేయనుందని తెలుస్తోంది.
1) విప్ జారీ చేయడం: ప్రస్తుతం భర్తీ అయ్యే రెండు రాజ్యసభ స్థానాలు కూడా ఎమ్మెల్యేల ఓటుతోనే భర్తీ అవుతున్నాయి. రహస్య బ్యాలెట్ ఓటు ద్వారా రాజ్యసభ అభ్యర్థులను ఎన్నుకుంటారు. అయితే.. ఈ క్రమంలో సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు విప్ జారీ చేసే అవకాశం ఉంది. అంటే.. తమ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వీరికే ఓటు వేయాలని తేల్చి చెప్పవచ్చు. బీఆర్ఎస్ దీనిని వినియోగించుకోవడం ద్వారా .. జంపింగ్ ఎమ్మెల్యేలు పది మందిని ఇరకాటంలోకి నెట్టే అవకాశం ఉంటుంది.
వారు వేసే ఓటు ఎవరికి అనేది బీఆర్ఎస్‌కు తెలిసిపోతుంది. తద్వారా.. విప్‌ను ఉల్లంఘిస్తే.. దీనిపై ఫిర్యాదు చేసి చట్టపరంగా పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ.. చట్టపరమైన చర్యలు ఆలస్యమైతే.. సదరు పది మందిపై రాజకీయంగా ప్రజల్లో పలుచన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం కూడా బీఆర్ఎస్‌కు దక్కనుంది. సో.. మొత్తంగా ఈ వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా ఆ పది మందిని తన దారికి తెచ్చుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఉంది.
2) బీఆర్ఎస్ తరఫున అభ్యర్థి: వాస్తవానికి అసెంబ్లీ బలాబలాలను చూసుకుంటే.. బీఆర్ ఎస్‌కు పెద్దగా బలం లేదు. మొత్తం 119 ఎమ్మెల్యేల్లో 63 మంది నేరుగా కాంగ్రెస్‌కు ఉన్నారు. మరో పది మంది బీఆర్ ఎస్ తరఫున గెలిచి కూడా కాంగ్రెస్‌కుమద్దతు ప్రకటించారు. సో.. మొత్తంగా 73 మంది కాంగ్రెస్‌కు ఉన్నారు. కానీ, ఇప్పుడుబీఆర్ ఎస్ తన అభ్యర్థిని ప్రకటిస్తే.. ఒక్కొక్క అభ్యర్థికి నిర్దిష్టంగా 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది.
ఈ క్రమంలో కాంగ్రెస్‌లో అసంతృప్తులు కానీ, ఎంఐఎం అభ్యర్థులు కానీ.. తమతో కలిసి వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనిని ఎదుర్కొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా కష్టపడాలి. లేకపోతే.. బీఆర్ ఎస్ విన్నయినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 27, 2026 11:38 pm
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…