Movie News

అతడు స్టామినాని వృథా చేస్తున్నారు

ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే ఉంది. రేపు అతడుని మళ్ళీ విడుదల చేస్తున్నారు. బుకింగ్స్ ఏమంత చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఇవాళ రాత్రి హైదరాబాద్ లో నాలుగు స్పెషల్ ప్రీమియర్లు వేస్తే ఇప్పటిదాకా ఒక్కటి హౌస్ ఫుల్ కాలేదు.

షో టైంకి నిండితే చెప్పలేం కానీ ఆన్ లైన్ బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. రేపు ఉదయం రెండు మూడు సింగల్ స్క్రీన్లలో మినహాయించి మిగిలినవన్నీ సోసోనే ఉన్నాయి. సహజంగా మహేష్ బాబు అభిమానుల్లో కనిపించే ఎగ్జైట్ మెంట్ ఈసారి తక్కువగా ఉన్న మాట వాస్తవం.

దీనికి కారణం ఒకటే. మరీ తక్కువ గ్యాప్ లో అదే పాత సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేయడమే. అతడు మొన్న ఆగస్ట్ లోనే మహేష్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. బాగానే చూశారు కానీ మరీ రికార్డులు బద్దలు కాలేదు. ఏదో టైమింగ్ మిస్సయ్యిందనుకున్నారో ఏమో తిరిగి ఇంతలోపే మరోసారి తీసుకొచ్చారు.

శాటిలైట్ ఛానల్ లో కొన్ని వందలసార్లు ప్రసారమై యూట్యూబ్ లో ఫ్రీగా దొరుకుతున్న సినిమాని ఇన్నేసిసార్లు రుద్దడం వల్ల దాని స్టామినా వృథా అయిపోతోంది. రాబోయే రోజుల్లో ఇంకోసారి అంటే స్వంత ఫ్యాన్సే లైట్ తీసుకునే ప్రమాదముంది. ఇది నిర్మాతలు గుర్తించాలి.

అసలు కొత్త సినిమాలకే థియేటర్లలో జనం లేరు. సంక్రాంతి హడావిడి అయిపోయి జనవరి చివరి వారం నుంచి జనం లేక హాళ్లు లబోదిబోమంటున్నాయి. రెండు మూడు ఓ మోస్తరుగా పర్వాలేదనిపించుకున్నా హౌస్ ఫుల్స్ చేయించిన బొమ్మ ఒక్కటీ రాలేదు.

వారం వారం ఎదురుచూసే కొద్దీ నిరాశే మిగులుతోంది కానీ ఊరట కలిగించే సూపర్ హిట్ రాలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే దాకా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంత డ్రై సిచువేషన్ లో ఏదో నాలుగు డబ్బులు చేసుకుందామని ఆశపడిన అతడుకి నిరాశే మిగిలేలా ఉంది. అరగదీస్తే జరిగేది ఇదే మరి.

This post was last modified on February 27, 2026 11:33 pm

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

13 minutes ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

19 minutes ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

34 minutes ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

1 hour ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago