Political News

‘నీటి’ రాజకీయాలకు చంద్రబాబు నో!!

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న నీటి స‌మ‌స్య‌ను రాజకీయం చేయ‌ద‌ల్చుకోలేద‌ని సీఎం చంద్రబాబు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాల‌నే తాను కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టును తెలంగాణ ప్ర‌భుత్వం క‌ట్టిన‌ప్పుడు.. తాను అడ్డుకోక‌పోవ‌డానికి కార‌ణం ఇదేన‌ని తెలిపారు. అప్ప‌ట్లో చాలా మంది దీనిపై త‌న‌ను రెచ్చ‌గొట్టేలా ప్ర‌య‌త్నించార‌ని.. కానీ, అన్నీ ఆలోచించే ఆనాడు తాను అడ్డు చెప్ప‌లేద‌న్నారు. దీనివ‌ల్ల తెలంగాణ స‌స్య‌శ్యామలం అవుతుంద‌న్నారు.

అదేవిధంగా ఇప్పుడు పోల‌వ‌రం-మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టును చేప‌ట్టామ‌ని.. దీనిని పూర్తి చేయ‌డం ద్వారా సీమ ప్రాంతానికి నీళ్లు ఇచ్చే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టామ‌న్నారు. కానీ.. దీనిని అర్ధం చేసుకోలేకపోతున్నార‌ని వ్యాఖ్యానించారు. న‌దుల అనుసంధానం జ‌రిగితే.. రాష్ట్రాల‌కు, దేశానికి కూడా ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని.. త‌ద్వారా వ్య‌వ‌సాయం మ‌రింత పుంజుకుంటుంద‌ని చెప్పారు. అసెంబ్లీలో సుదీర్ఘ ప్ర‌సంగం చేసిన చంద్ర‌బాబు.. నీటి వ‌న‌రుల ప‌రిర‌క్ష‌ణ‌పై మాట్లాడారు.

గంగా- కావేరి న‌దుల‌ అనుసంధానం కావాలనేది త‌న‌ ప్రగాఢ ఆకాంక్షగా చంద్ర‌బాబు చెప్పారు. దీనికి గ‌తంలోనే తాను రోడ్ మ్యాప్ రూపొందించాన‌ని.. కానీ, సాకారం కాలేద‌న్నారు. కావేరీ న‌ది జ‌లాల కోసం రెండు రాష్ట్రాల మ‌ధ్య యుద్ధం(త‌మిళ‌నాడు-క‌ర్నాట‌క‌) జ‌రుగుతున్న విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. కానీ, న‌దుల అనుసంధానం జ‌రిగితే.. ఈ త‌ర‌హా ఉద్రిక్త‌త‌లు ఉండ‌బోవ‌ని.. అన్ని రాష్ట్రాల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు.

ఉమ్మ‌డి స‌హా ప్ర‌స్తుత ఏపీలో కట్టిన ప్రాజెక్టులన్నీ టీడీపీ హయాంలోనే జరిగాయ‌ని చంద్ర‌బాబు చెప్పారు. పట్టిసీమ నుంచి 100 టీఎంసీల నీటిని కృష్ణాకు తీసుకొచ్చామ‌న్నారు.

“కొంద‌రు(వైసీపీ) ప్రాజెక్టులు కూడా పూర్తికాకుండానే.. రిబ్బ‌న్ క‌టింగులు చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారో.. ప్ర‌జ‌లే వారిని నిల‌దీయాలి“ అని వ్యాఖ్యానించారు. వెలిగొండ‌ను పూర్తిచేసే బాధ్య‌త‌ను తాను తీసుకున్న‌ట్టు చెప్పారు. పోల‌వ‌రం మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టు ద్వారా ఇరు రాష్ట్రాల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు.

This post was last modified on February 26, 2026 10:54 pm

Share

Recent Posts

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

54 minutes ago

కుటుంబం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి

నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…

1 hour ago

రాజమౌళి రాబోయే ‘ట్రబుల్’ని గుర్తించలేదా

స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…

2 hours ago

ఎవరూ పట్టించుకోని ‘యుగంధర్’ పోరాటం

కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…

2 hours ago

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

6 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

13 hours ago