వైసీపీ హయాంలో జరిగిన మద్యం అక్రమాలకు సంబంధించి ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు తాజాగా మరో నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి రిమార్డ్ రిపోర్టులో పేర్కొ న్నారు. ఈ కేసులో కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయని.. ఈ నిధులను సేకరించడం.. కమీషన్లు రాబట్టడం.. వంటి విషయాల్లో.. ముప్పిడి అవినాష్ రెడ్డి సూత్రధారి అని పేర్కొన్నారు.
ఏం చేశాడంటే..
మద్యం కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారి(ఏ1) కసిరెడ్డి రాజశేఖరరెడ్డితో కలిసి.. అవినాష్ రెడ్డి బిగ్ ప్లాన్ చేసినట్టు సిట్ అధికారులు పేర్కొన్నారు. కమీషన్లు సేకరించి.. వాటిని సిండికేట్‌కు అందించడంలో కీలక పాత్ర పోషించాడని తెలిపారు. ఈ మొత్తం సిండికేట్‌కు అవినాష్‌రెడ్డే కీలకమని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయనే చూశాడని తెలిపారు. ఉద్దేశ పూర్వకంగానే నిధులను దారి మళ్లించి.. సిండికేట్ లోని కీలక వ్యక్తులకు చేరవేశాడని పేర్కొన్నారు.
అంతేకాదు.. ఎవరైతే ఎక్కువ కమీషన్‌కు ఒప్పుకొంటారో.. వారికి మాత్రమే ఆర్డర్లు ఇచ్చేలా చక్రం తిప్పాడని కూడా సిట్ తన రిపోర్టులో స్పష్టం చేసింది. ఇటీవల హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ముప్పిడి అవినాష్ సిట్ అధికారుల ముందు లొంగిపోయాడు. ముందస్తు బెయిల్‌ను కోరినప్పటికీ.. నేర తీవ్రత నేపథ్యంలో బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో అధికారుల ముందు లొంగిపోయిన అవినాష్‌రెడ్డిపై రిమాండ్ రిపోర్టును ప్రిపేర్ చేశారు.
3500 కోట్లు..
మద్యం తయారీ కంపెనీల నుంచి 3500 కోట్ల రూపాయల మేరకు ముడుపులు సేకరించినట్టు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. ఈ సొమ్మును 2024 అసెంబ్లీ ఎన్నికలకు వినియోగించే విషయంలో కీలకంగా వ్యవహరించాడని తెలిపారు. విలాసవంతమైన జీవితాన్ని గడిపిన ముప్పిడి.. తానే అన్నీ అయి వ్యవహ రించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ దుకాణాల ద్వారానే అక్రమాలకు తెరదీశారని పేర్కొనడం గమనార్హం.
This post was last modified on February 26, 2026 10:52 pm
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…