కమల్ మాట్లాడింది జగన్ గురించి కాదు స్వామి

టీవీ5 సాంబ…సోషల్ మీడియాలో బాగా పాపులర్. టీవీ5 తెలుగు న్యూస్ ఛానెల్లో సాంబ చదివే వార్తలకు సెపరేట్ ట్రోలర్స్ ఫ్యాన్ బేస్ ఉంది. సాంబ టంగ్ స్లిప్ అయ్యి చేసే కామెంట్ల వీడియోలు సోషల్ మీడియాలో చాలాకాలంగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి సాంబ తన మార్క్ కామెంట్లతో ట్రోలర్స్ కు మంచి స్టఫ్ ఇచ్చారు.

రాజ్యసభలో కమల్ హాసన్ చేసిన కామెంట్లు ఏపీ మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి చేసినవి అనుకొని కమల్ పై సాంబ విరుచుకుపడ్డారు. అయితే, అసలు కమల్ కామెంట్లు జగన్ ను ఉద్దేశించి చేసినవి కాదని సాంబను నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

జ‌గ‌న్నాథ ర‌థ‌చ‌క్రాలు వ‌స్తున్నాయ్‌.. వ‌స్తున్నాయ్‌.. నేను ఏం చెప్తున్నానో తెలుగువాళ్లకు అర్థమవుతుంది అంటూ కమల్ రాజ్యసభలో ప్రసంగించారు. ఎవ‌రికీ అధికారం శాశ్వతం కాదు.. ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వం శాశ్వతంగా లేదు అని కమల్ వ్యాఖ్యానించారు. అయితే, వైసీపీ అభిమానులు కమల్ కామెంట్లు జగన్ గురించేనని సోషల్ మీడియా పేజీల్లో ఊదరగొట్టేశారు. దీంతో, సాంబ రంగంలోకి దిగారు.

అసలు ఏపీ రాజకీయాలతో కమల్ హాసన్ కు ఏం పని అంటూ తన మార్క్ కామెంట్లతో విరుచుకుపడ్డారు. అంతేకాదు, దమ్ముంటే ఏపీలో పోటీ చేసి కమల్ ఒక్క సీటు గెలవగలరా అంటూ సవాల్ విసిరారు. కమల్ సినిమాలు ఆదరించిందే ఏపీ అని…తమిళ రాజకీయాల నుంచి పారిపోయే మనిషి కమల్ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు కమల్ కు క్యారెక్టర్ లేదని కూడా సెలవిచ్చారు.

ఇక, ఇటీవల ఒక పెళ్లి వేడుకలో తమిళ హీరో సూర్య, కార్తీలతో జగన్ మాట్లాడిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. సినిమా వాళ్లను చూడ్డానికి జనం వస్తారని అన్నారు. డబ్బు ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గరకే సినిమావాళ్లు చేరతాని కూడా సెలవిచ్చారు.

సినిమావాళ్లదేం లేదని…హాజీ మస్తాన్ వంటి స్మగ్లర్ కాళ్లు రాజ్ కపూర్ వంటి దిగ్గజ నిర్మాత పట్టుకున్న రోజులున్నాయని గతంలోకి వెళ్లారు. దీంతో, యథా ప్రకారం సాంబ అసలు జర్నలిస్ట్ ఎలా అయ్యారు…ఆయను ఆణిముత్యాలు భరిస్తూ ఉద్యోగంలో ఎలా కొనసాగిస్తున్నారు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.