కల్తీ మద్యం కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ ఆదేశాలతోనే కల్తీ మద్యం, నకిలీ మద్యం తయారు చేశామని ఆ కేసులో అరెస్ట్ అయిన ఏ1 జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జోగి రమేష్ ను అరెస్ట్ చేయబోతున్నారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈరోజు ఉదయం జోగి రమేష్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
నోటీసులు ఇచ్చి జోగి రమేష్ ను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు… అనంతరం ఆయనను విజయవాడ సిట్ ఆఫీసుకు తరలించారు. అరెస్టు సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసం వద్ద హైడ్రామా నడిచింది. ఉదయం 5 గంటలకే రమేష్ ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు.. జోగి రమేష్ తో పాటు ఆయన పీఏ ఆరేపల్లి రామును కూడా అరెస్ట్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates