జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం.. పిఠాపురంలో ఏం జరుగుతోంది? పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు అక్కడ వరుస పర్యటనలు ఎందుకు చేస్తున్నారు? అనేది ఆసక్తిగా మారింది. పైగా ఇటీవల కాలంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలతో వర్మకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఖర్మ
అని జనసేన ఆవిర్భావ వేడుకల సమయంలో నాగబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో వర్మ అనుచరులు.. హర్ట్ అయ్యారు.
ఇది రాజకీయంగా జనసేనకు ఇబ్బందికలిగించే అకాశం ఉంది. ఎందుకంటే.. పార్టీ తరఫున పవన్ కల్యా ణ్ పిఠాపురంలో పోటీ చేసినా.. గ్రామీణ స్థాయిలో మాత్రం టీడీపీ నాయకుడు వర్మ చేసిన ప్రచారం ఉంది. దీనిని నియోజకవర్గం ప్రజలు కూడా అంగీకరిస్తారు. ఇక, నాగబాబు-వర్మల మధ్య పెరుగుతున్న గ్యాప్ కారణంగా.. వర్మకు సానుభూతి పెరిగే అవకాశం ఉంది. ఇది ఒక అంచనా. అదేసమయంలో వీరి మధ్య ఉన్న గ్యాప్.. పరోక్షంగా వైసీపీకి మేలు చేసే చాన్స్ కనిపిస్తోంది.
ఇలా అన్ని కోణాల్లోనూ పిఠాపురం రాజకీయాల పై చర్చలు, విశ్లేషణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిఠాపురంలో తమ హవా తగ్గకుండా.. క్షేత్రస్థాయిలో మరో వ్యక్తి లేదా.. పార్టీ ఉనికి బలోపేతం కాకుండా చూసుకునే క్రమంలోనే ఇప్పుడు పిఠాపురానికి నాగబాబు వచ్చారని అంటున్నారు. తద్వారా.. పవన్ ఇమేజ్ ఎలా ఉన్నా.. పార్టీపరంగా.. నాగబాబు కొంత మేరకు ఉపయోగపడతాడన్న చర్చ ఉంది. అందుకే.. తాజాగా ఆయన రెండు రోజుల పాటు ఇక్కడే మకాం వేయడం గమనార్హం.
అంతేకాదు.. పలు అభివృద్ది కార్యక్రమాలను కూడా ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు చక్కబెట్టారు. కొన్నింటిని ప్రారంభించారు. మరికొన్నింటికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఇదిలావుంటే.. ఎన్నికల సమయానికి వేరే నేత ఎవరూ ఉండే పరిస్థితి ఇక్కడ పూర్తిగా లేకుండా చేయాలన్న ప్రధాన అజెండాతోనే నాగబాబు వస్తున్నారన్న మరో చర్చ కూడా ఉండడం గమనార్హం. అయితే.. ఈ విషయంలో వర్మ ఎలాంటి ఎత్తుగడ వేస్తారన్నది. మరి ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.