జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్బంగా అధికారిక కార్యక్రమం వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి సర్కారు పీ4 పేరిట పేదలకు సంపన్నుల చేత తోడ్పాటు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం ఉగాది పర్వదినాన శ్రీకారం చుట్టింది. ఈ పథకం ప్రారంభోత్సవానికి అమరావతి పరిధిలో ఏర్పాటు చేసిన సభావేదికకు టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో కలిసి పాలుపంచుకున్న పవన్… ఈ వేదిక మీద గతంలో ఎన్నడూ లేనంత మేర సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదు కాబట్టే చంద్రబాబుకు మద్దతుగా నిలిచానని పవన్ పేర్కొన్నారు.
2014 ఎన్నికలకు కాస్తంత ముందుగానే తాను రాజకీయ పార్టీని పెట్టినా… నాడు ఎన్నికల్లో పోటీ చేసేంత సత్తా తనకు లేదన్న విషయాన్ని ఎన్నికలకు ముందే గ్రహించానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ కారణంగానే నాడు బలీయంగా ఉన్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీకి మద్దతు ఇచ్చానని పేర్కొన్నారు. సత్తా లేనప్పుడు ప్రజలకు మేలు చేసే వారికి మద్దతు ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే పేదలకు మించి చేసే గుణం ఉన్న చంద్రబాబు కు మద్దతు ఇస్తూ వస్తున్నానని ఆయన అన్నారు. 2014 నుంచి కూడా ఇదే భావనతోనే తాను సాగుతున్నానని కూడా పవన్ పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు మద్దతుగా నిలిచానని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి గెలవకపోయి ఉంటే…పరిస్థితి ఎలా ఉండేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు విజన్ గురించి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు మాత్రమే పరిమతం అయ్యే నాయకుడు కేవలం వచ్చే ఎన్నికల గురించి మాత్రమే ఆలోచిస్తాడని పవన్ అన్నారు. అయితే విజన్ కలిగిన చంద్రబాబు లాంటి నేత ఎన్నికల గురించి కాకండా రాబోయే తరం గురించి ఆలోచిస్తారని ఆయన పేర్కొన్నారు చంద్రబాబు విజన్ ముందు చూపుతో కూడుకున్నదని కూడా పవన్ అన్నారు. అలాంటి ముందు చూపు ఉంది కాబట్టే పీ4 లాంటి పథకం చంద్రబాబు మదిలో మెదిలిందన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పేదరికం నిర్మూలించ బడుతుందన్న నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలు ఉన్నాయని తేలిందన్న పవన్… పీ4 తొలి దశలో 20 లక్షల కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకొస్తామని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates