శ్రీవిశ్వావసు నామ తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాంగ కర్త, ప్రముఖ అవధాని నారాయణ మూర్తి పంచాంగ పఠనం చేశారు. వైసీపీ అధినేత జగన్ ది మిథున రాశి అని తెలిపారు. ఈ రాశివారికి భయం అనేది ఉండదని.. అదే విధంగా జగన్‌కు కూడా భయం లేదని తెలిపారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. ఆయన ఎక్కడా భయ పడడం లేదన్నారు.
ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతున్నట్టు పంచాంగ కర్త తెలిపారు. మిథున రాశి వారికి ఈ ఏడాది చాలా బాగుందన్నారు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి కృష్ణదేవరాయులు మాదిరిగా జగన్ కూడా చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. 2019 ఎన్నికల్లో మాదిరిగా జగన్ త్వరలోనే మరోసారి విజయదుందుభి మొగి స్తారని పంచాంగ కర్త తెలిపారు. ఆవేశంలో ప్రజలు గత ఎన్నికల్లో తప్పులు చేశారని.. ఇప్పుడు చింతిస్తున్నారని పంచాంగ కర్త చెప్పడం గమనార్హం.
అయితే..ఈ కార్యక్రమంలో జగన్ కానీ, ఆయన సతీమణి భారతి కానీ. పాల్గొనకపోవడం గమనార్హం. అదేవిధంగా తాడేపల్లి కార్యాలయంలోని పెద్దలు కూడా రాకపోవడం గమనార్హం. విజయవాడ నగర్ మేయర్.. సహా కొందరు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. కాగా.. వైసీపీ పంచాంగంపై నెటిజన్లు విమర్శలు చేస్తుండడం గమనార్హం. “ఇది ఉగాది పంచాంగం కాదు.. వైసీపీ పంచాంగం” అంటూ సెటైర్లు సంధించారు.