పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కీలక పథకాలను ప్రస్తావించారు. అదే సమయంలో పలు కీలక రాష్ట్రాలకు చెందిన కీలక అంశాలను వరుసగా ప్రస్తావిస్తూ సాగారు. ఈ సందర్భంగా ఆమె ఏపీ పేరును కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
రాష్ట్రపతి తన ప్రసంగంలో ఏపీ అంశానికి వస్తూ.. రాష్ట్రానికి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టును ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి గాను ఇటీవలే రూ.12 వేల కోట్లను విడుదల చేసిన అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ప్రాజెక్టు పూర్తి అయ్యేదాకా రాష్ట్రానికి కేంద్రం అండగా నిలుస్తుందని ప్రకటించారు.
కీలకమైన కేంద్ర బడ్జెట్ కు ఒకరోజు ముందు… పార్లమెంటు ఉభయ సభల సభ్యుల సాక్షిగా రాష్ట్రపతి నోట ఏపీ మాట వినిపించిన తీరుపై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఎన్నో రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల్లో మరెన్నో ప్రాజెక్టులు కొనసాగుతున్నా… ఏపీని ప్రస్తావించిన రాష్ట్రపతి…ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని భరోసా ఇవ్వడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా బడ్జెట్ ముందు నాడు రాష్ట్రపతి నోట ఏపీ మాట వినిపించిందంటే… రేపటి బడ్జెట్ లోనూ ఏపీకి భారీ కేటాయింపులు తప్పకుండా ఉంటాయన్న కోణంలో విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates