Political News

ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబుకు పిలుపు

2024 సార్వత్రిక ఎన్నికలలో ఇటు ఏపీతో అటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేంద్రంలోని మోదీ సర్కార్ ఏర్పాటులో కూడా కూటమి తరఫున గెలుపొందిన ఎంపీలు కీలక పాత్ర వహించారు. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని మహాయుతి కూటమి గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే అదే ఊపుతో ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనాలని సీఎం చంద్రబాబుకు బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల తరఫున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. దేశంలోని సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు చంద్రబాబు. అంతే కాకుండా అత్యంత అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి కూడా ఆయనే. దీంతో, చంద్రబాబు సేవలను వినియోగించుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈ సారి ఆప్ ను ఎలాగైనా ఓడించాలని బీజేపీ పెద్దలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఫిబ్రవరి 1వ హస్తినలో తెలుగు వారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తారు.

మరి, ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి డిప్యూటీ సీఎం పవన్ కూడా వెళతారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు లేదని కేజ్రీవాల్ ప్రకటించారు.

This post was last modified on January 28, 2025 7:29 pm

Share

Recent Posts

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

1 minute ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

9 minutes ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

2 hours ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

2 hours ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

3 hours ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

3 hours ago